తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్, ఫార్మసిస్ట్ ఖాళీలను రిక్రూట్ చేస్తారు.

ఈ పోస్టులకు హిందూ మతానికి చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ గ్రేడ్-I ఖాళీలు 2 ఉండగా… న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ గ్రేడ్-II పోస్టులు 02 ఉన్నాయి. న్యూక్లియర్ మెడిసిన్ రేడియో ఫార్మసిస్ట్ గ్రేడ్-II పోస్టు ఒకటి ఉంది. ఈ పోస్టులకు డిసెంబర్ 10వ తేదీన ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
నోటిఫికేషన్ ముఖ్య వివరాలు:
- ఉద్యోగ ప్రకటన - శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, తిరుపతి
- మొత్తం ఖాళీలు - 05
- పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎంఎస్సీ, పీజీ డిప్లొమా, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి. పని చేసిన అనుభవం కూడా ఉండాలి.
- ఓసీ అభ్యర్థులకు 42 ఏళ్లు, ఎస్సీ/బీసీలకు 47 ఏళ్లు మించకూడదు.
- ఇంటర్వ్యూ, పని అనుభవం ఆధారంగా ఎంపిక ఉంటుంది.
- ఇంటర్వ్యూ తేదీ - 10 డిసెంబర్ 2025.
- ఇంటర్వ్యూ జరిగే ప్లేస్: పాత కమిటీ హాల్, శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టి్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అలిపిరి రోడ్, తిరుపతి.
- ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య రిపోర్టింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. విద్యా అర్హత పత్రాలను వెంట తీసుకెళ్లాలి.
- అధికారిక వెబ్ సైట్ - https://svimstpt.ap.nic.in/
- అప్లికేషన్ లింక్ - https://svimstpt.ap.nic.in/jobs_files/NM-Appl25.pdf
{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}