అనకాపల్లి జిల్లాలోని 20 వేల మంది లబ్ధిదారులకు ఉచితంగా పీఎం సూర్యఘర్ పథకం : మంత్రి గొట్టిపాటి
అనకాపల్లి జిల్లాలోని 20 వేల మంది లబ్ధిదారులకు ఉచితంగా పీఎం సూర్యఘర్ పథకం అమలు చేస్తామని మంత్రి గొట్టిపాటి అన్నారు. బయట నుంచి విద్యుత్ కొనుగోళ్లను కూడా గణనీయంగా తగ్గించామన్నారు.
ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చడంతో పాటు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయం సరఫరా చేయడానికే సబ్ స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా ముందుగా అనకాపల్లిలో రూ.5.50 కోట్లతో నిర్మించనున్న సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయం భవానికి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణతో కలిసి మంత్రి గొట్టిపాటి శంకుస్థాపన చేశారు.

అనంతరం మాడుగుల నియోజకవర్గ పరిధిలోని కే.కోటపాడు మండలం చౌడువాడతో పాటు మాడుగుల మండలం కింతలిలో నిర్మించిన 33\11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఆ తరువాత చౌడువాడ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాకు 10 సబ్ స్టేషన్లు మంజూరు చేశామన్నారు. అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఎజెండాగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. బయట నుంచి విద్యుత్ కొనుగోళ్లను కూడా గణనీయంగా తగ్గించామన్నారు. దీని ద్వారా శాఖాపరమైన వ్యయాన్ని తద్వారా ప్రజలపై పడే భారాన్నీ తగ్గిస్తున్నామని తెలిపారు.
ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చడం కోసం ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలోని 11 జిల్లాలలో రూ.250 కోట్లతో మొత్తం 65పైగా సబ్ స్టేషన్లను నిర్మిస్తున్నట్టుగా మంత్రి గొట్టిపాటి వివరించారు. ప్రజల అవసరార్థం మాడుగుల నియోజక వర్గానికే రెండు సబ్ స్టేషన్లు కేటాయించామన్నారు. స్థానిక శాసనసభ్యుని విజ్ఞప్తి మేరకు ఇదే నియోజకవర్గానికి మరో సబ్ స్టేషన్ మంజూరు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. అదే విధంగా రాయితీతో కూడిన పీఎం సూర్యఘర్ పథకాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు.
అనకాపల్లి జిల్లాలోని 20 వేల ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఉచితంగా పీఎం సూర్యఘర్ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి గొట్టిపాటి ప్రకటించారు. వారి ఇళ్లకు సోలరైజేష్ చేస్తామని హామీ ఇచ్చారు. అనకాపల్లి పరిధిలోని కే.కోటపాడు, వెంకన్నపాలెం విద్యుత్ కేంద్రాలపై పెరుగుతున్న లోడ్‌ను తగ్గించేందుకు చౌడువాడలో 33\11 కేవీ ఉప విద్యుత్ కేంద్రాన్ని నిర్మించినట్లు మంత్రి తెలిపారు. ఎప్పుడూ లేని విధంగా తుపాను సమయంలో కేవలం 24 గంటల వ్యవధిలోనే 16,000పైగా దెబ్బతిన్న విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసి, విద్యుత్ సరఫరా పునరుద్ధరించామన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు దార్శినిక పాలనలో తీసుకున్న విద్యుత్ సంస్కరణ ఫలితంగానే రాష్ట్రంలో విద్యుత్ ఇబ్బందులు తొలగిపోయాయని మంత్రి గొట్టిపాటి చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖను ఆదాయ వనరుగా చూసి, ప్రజలపై మోయలేని భారాలు మోపారని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం విధించిన 40 పైసల ట్రూ అప్ ఛార్జీలలో ఇప్పటికే 13 పైసలను తగ్గించామని తెలిపారు. ఈ ఆర్థిక ప్రయోజనలన్నీ విద్యుత్ వినియోగదారులకు నేరుగా అందించడం జరుగుతుందన్నారు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూటమి ప్రభుత్వం తీసుకున్నసబ్ స్టేషన్ల నిర్మాణం వంటి నిర్ణయాలతో ఇకపై లో ఓల్టేజ్ సమస్యలు, తాత్కాలిక విద్యుత్ అంతరాలు గణనీయంగా తగ్గిపోతాయని గొట్టిపాటి వెల్లడించారు. కింతలిలో అందుబాటులోకి వచ్చిన నూతన ఉప విద్యుత్ కేంద్రంతో ఆ ప్రాంత గ్రామాల వాసులకు ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారని మంత్రి గుర్తు చేశారు.
ఇచ్చిన మాటకు కట్టుబడిన సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందిస్తుందని మంత్రి గొట్టిపాటి తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా సుమారు 65 లక్షల మంది లబ్ధిదారులకు రూ.34 వేల కోట్లను పెన్షన్ రూపంలో అందిస్తున్నామని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వ లేదని మంత్రి గొట్టిపాటి ఆరోపించారు.
'కూటమి ప్రభుత్వం ఏర్పడిడిన వెంటనే భర్తలు చనిపోయిన 1.57 లక్షల మంది వితంతువులకు పెన్షన్లు జారీ చేశాం. ఉచిత బస్, తల్లికి వందనం అమలు చేయడంతో పాటు డిఎస్సీతో 16,300 టీచర్ ఉద్యోగాలతో పాటు పోలీస్ శాఖలోనూ ఉద్యోగాలను భర్తీ చేశాం. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం.' అని మంత్రి గొట్టిపాటి అన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


