...
...
Next Story

2027 గోదావరి పుష్కరాలకంటే ముందే పోలవరం పూర్తి చేస్తాం : సీఎం చంద్రబాబు

కూటమి ప్రభుత్వం పింఛన్ల పంపిణీ కోసం ఏడాదికి రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. పింఛన్లకు ఏపీ కంటే ఏ రాష్ట్రం కూడా ఎక్కువగా ఖర్చుపెట్టడం లేదన్నారు.

Updated on: Dec 1, 2025, 16:08:05 IST
Advertisement

ఏలూరు జిల్లాలోని గోపీనాథపట్నంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పింఛన్లను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. సూపర్ సిక్స్ పథకాలను సక్సెస్ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదని చంద్రబాబు అన్నారు. తాను, పవన్ కల్యాణ్ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఒకే రకంగా ఆలోచిస్తామన్నారు.

గోపీనాథపట్నం గ్రామంలో కిడ్నీ బాధిత మహిళ గుడ్ల నాగలక్ష్మికి పింఛను అందించిన సీఎం చంద్రబాబు
గోపీనాథపట్నం గ్రామంలో కిడ్నీ బాధిత మహిళ గుడ్ల నాగలక్ష్మికి పింఛను అందించిన సీఎం చంద్రబాబు

'మా ప్రభుత్వంలో పింఛన్లకు ఏడాదికి రూ.33వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఏపీలో వందమందిలో పదమూడు మందికి పెన్షన్లు ఇస్తున్నాం. అందులో 95 శాతం మంది మహిళలే. మా ప్రభుత్వానికి కష్టాలు, అప్పులు ఉన్నాయి. అయినా ఒకేసారి 4 వేలకు పింఛన్లు పెంచాం. జనాభాను పెంచాల్సిన అవసరం ఉంది. లేకపోతే మిషన్లతో పని చేయించాల్సి ఉంటుంది.' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పున:నిర్మాణం చేసే పనిలో ఉన్నామన్నారు. గ్రామ సభలపై చంద్రబాబు మాట్లాడారు. సభలను మెుక్కుబడిగా నిర్వహించడం కాదని, ఒక మార్పు రావాలని అన్నారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమది అని పేర్కొన్నారు. ఇంట్లో ఎందరు ఉన్నా తల్లికి వందనం అమలు చేస్తున్నామన్నారు. ఒకప్పుడు నెల పింఛను తీసుకోకపోతే వాటిని ఇచ్చేవారు కాదని, ఇప్పుడు రెండు, మూడు నెలల పింఛను ఒకేసారి తీసుకునే అవకాశం కల్పించామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు.

'ప్రతీ నియోజకవర్గంలో జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తున్నాం. మహిళలను కూడా ప్రోత్సహిస్తున్నాం. రాయితీలు ఇస్తాం. ప్రతీ జిల్లాలో పరిశ్రమలు రావాలి. కుటుంబానికో పారిశ్రామికవేత్త రావాలి. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తూనే పరిశ్రమలు తెస్తాం. 2027 గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితమిస్తాం.' అని చంద్రబాబు అన్నారు.

ఏలూరు కలెక్టర్ పనితీరు మీద సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై సిబ్బందికి కనీస అవగాహన లేకుండా గ్రామసభకు ఎలా వచ్చారని ప్రశ్నించారు. గ్రామంలో ఎన్ని టాయిలెట్స్, ఎన్ని ఇళ్లు ఉన్నాయనే కనీస అవగాహన లేకుండా గ్రామ సభకు ఎలా వస్తారన్నారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల ఆదాయం పెరిగే విధంగా అధికారులు ఆలోచించాలన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe