గ్రామానికి చేరుకోలేకపోయిన అంబులెన్స్.. పోలీస్ జీపులో ఆసుపత్రికి గర్బిణి.. కవలలు జననం!
మెుంథా తుపానుతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీంతో అంబులెన్సు రాక ఇబ్బంది పడుతున్న గర్భిణిని పోలీసు జీపులో ఆస్పత్రికి తరలించారు. ఆమె కవలలకు జన్మనిచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో మెుంథా తుపాను ప్రభావంతో భారీగా పడింది. దీంతో చాలా ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు అయ్యాయి. తుపానుతో వాగులు, వంకల్లో వరద నీరు భారీగా ప్రవహించింది. ఇదే సమయంలో బాపట్ల జిల్లాలో ఓ గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి. అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో పోలీస్ జీపులో ఆసుపత్రికి తీసుకెళ్లారు. పూర్తి వివరాళ్లోకి వెళ్తే..

మెంథా తుపాను సమయంలో చాలా గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం కొణికి గ్రామ పంచాయతీలోని కట్టవారిపాలెం గ్రామంలో 24 ఏళ్ల కీర్తికి పురిటినొప్పులు వచ్చాయి. మెుంథా తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లాయి. అత్యవసర సేవలకు పూర్తిగా అంతరాయం కలిగింది. 108 అంబులెన్స్ గ్రామాన్ని చేరుకోలేకపోయింది.
మెడికల్ ఎమర్జెన్సీ గురించి సమాచారం అందుకున్న ఎస్ఐ సురేష్, కొణికి గ్రామ మహిళా పోలీసు అధికారి ప్రియ, మహిళా హెడ్ కానిస్టేబుల్ బ్రహ్మేశ్వరి, హెడ్ గార్డ్ రామకృష్ణ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అంగన్‌వాడీ కార్యకర్త, మహిళా పోలీసు అధికారి సహాయంతో గర్భిణిని జాగ్రత్తగా తమ పోలీసు జీపులో ఎక్కించారు. తుపాను పరిస్థితుల మధ్య వరదలున్న ప్రాంతం గుండానే మెల్లగా ప్రయాణించి కీర్తిని ఇంకొల్లులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె కవల పిల్లలను సురక్షితంగా ప్రసవించింది. తల్లి, శిశువులు సురక్షితంగా ఉన్నారు.
తెలంగాణలో
తెలంగాణలోని నల్గొండ జిల్లాలోనూ గర్భిణి ఇబ్బందులు ఎదుర్కోంది. దేవరకొండ మండలం మడమడక గ్రామంలో జట్టి దేవి ప్రసవ వేదనకు గురైంది. 108కి ఫోన్ చేసింది. చింతపల్లి నుంచి 108 సిబ్బంది వెంటనే స్పందించారు. అయితే ఓ వైపు భారీగా వర్షం పడుతుంది. మైనంపల్లి వాగు ప్రవహిస్తోంది.
దీంతో చింతపల్లి 108 సిబ్బంది రవి నాయక్, సైదులు గర్భిణిని స్ట్రెచర్ మీద వాగు దాటించారు. తర్వాత సురక్షితంగా దేవరకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గర్భిణి కుటుంబ సభ్యులు, స్థానికులు 108 సిబ్బందిని అభినందించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


