...
...
Next Story

తల్లిదండ్రులకు అలర్ట్ - ఈనెల 21న రాష్ట్ర వ్యాప్తంగా ప‌ల్స్ పోలియో

ఈనెల 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప‌ల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. 54 ల‌క్ష‌ల మందికి పైగా పిల్ల‌ల‌కు పోలియో చుక్క‌లు వేసేందుకు ఏర్పాట్లు చేయనున్నారు.

Published on: Dec 14, 2025, 06:19:16 IST
Advertisement

ఈనెల 21న ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించనున్నారు.ఈ మేరకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌క‌మార్ యాద‌వ్ తెలిపారు. 5 ఏళ్లలోపు పిల్ల‌ల్లంద‌రికీ పోలియో చుక్క‌ల్ని త‌ప్ప‌కుండా వేయించాల‌ని, కేంద్ర ప్ర‌భుత్వ సూచ‌న‌ల మేర‌కు ఈ కార్య‌క్ర‌మాన్ని రాష్ట్రాల్లో నిర్వ‌హిస్తార‌ని తెలిపారు.

ఈనెల 21న రాష్ట్ర వ్యాప్తంగా ప‌ల్స్ పోలియో
ఈనెల 21న రాష్ట్ర వ్యాప్తంగా ప‌ల్స్ పోలియో

రాష్ట్ర వ్యాప్తంగా 54,07,663 మంది 5 ఏళ్ల లోపు పిల్లలకు 38,267 బూత్ లలో పోలియో చుక్క‌లు వేసేందుకు ఇప్ప‌టికే జిల్లాల‌కు 61,26,120 డోస్ ల‌ను రాష్ట్రంలోని అన్ని జిల్లాల‌కు పంపించారని మంత్రి సత్యకుమార్ వివరించారు.

డిసెంబ‌ర్ 21వ తేదీన పోలియో దినం సంద‌ర్భంగా రాష్ట్ర‌వ్యాప్తంగా బూత్ స్థాయిలో పిల్ల‌ల‌కు పోలియో చుక్క‌ల్ని వేస్తారు. ఆరోజు ప‌లు కార‌ణాలవ‌ల్ల పోలియో చుక్క‌లు వేసుకోలేక‌పోయిన పిల్ల‌లకు తిరిగి ఈనెల 22, 23 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి 76,534 బృందాలు ప‌రిశీలిస్తాయ‌ని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. భార‌త‌దేశం పోలియో ర‌హిత దేశం అయిన‌ప్ప‌టికీ మ‌ళ్లీ పోలియో రాకుండా ఉండేందుకు త‌గు ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల్ని తీసుకోవాల‌ని రాష్ట్రాల‌కు కేంద్రం సూచించింద‌ని తెలిపారు. 1704 మెడికల్ అధికారులు, 39,494 ఇతరులు (ఫార్మసిస్టులు, నర్సింగ్ విద్యార్థులు, ఇతర సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్ర‌తినిధులు, ఉపాధ్యాయులు), 4206 మంది పర్యవేక్షకులు నేష‌న‌ల్ ఇమ్యునైజేష‌న్‌ డే కార్య‌క్ర‌మంలో పాల్గొంటారని తెలిపారు.

1854 మొబైల్ బృందాలు...

పలు ప్రాంతాల్లో తిరిగేందుకు మొబైల్ బృందాల‌ను ఏర్పాటు చేశారు. ప్రతి మొబైల్ బృందంలో ఒక మెడిక‌ల్ ఆఫీస‌ర్ తో పాటు ఇద్ద‌రు సభ్యులు ఉంటారు. ఈనెల 21 నుండి 23 వ‌ర‌కు మొబైల్ బృందాలు ప‌ర్య‌టిస్తాయి. ఈనెల 22, 23 తేదీల్లో ఇంటింటికి వెళ్లి 5 ఏళ్ల‌లోపు పిల్లలందరినీ పరిశీలించి, వారికి పోలియో చుక్క‌లు వేస్తారు. ఇంటిలోని పిల్లలందరికీ పోలియో చుక్క‌లు వేస్తే “P” గుర్తుతోనూ, ఏ చిన్నారైనా మిస్ అయితే “X” గుర్తు వేస్తారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe