ద్రోణి ప్రభావం, ఆపై ఉపరితల ఆవర్తనం..! ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు

తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. 

Published on: Jun 5, 2025, 16:07:37 IST
By , , Andhrapradesh, Telangana
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ, తెలంగాణలో మరికొన్నిరోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణశాఖ వివరాలను తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది. మరోవైపు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వానలు పడొచ్చు.

ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు
ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు

ద్రోణి ప్రభావం… కొనసాగుతున్న ఆవర్తనం

అమరావతి వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ వివరాల ప్రకారం….. ఒక ద్రోణి దక్షిణ ఛత్తీస్ ఘడ్ నుంచి ఈశాన్య బంగ్లాదేశ్ వరకు విస్తరించింది. అక్కడ్నుంచి ఒడిశా, జార్ఖండ్ దానికి అనుకుని ఉన్న దక్షిణ బీహర్, బెంగల్ ఉత్తర ప్రాంతాల మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది. అంతేకాకుండా ఉత్తర అంతర్గత కర్ణాటక మరియు దానికి అనుకుని ఉన్న మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇప్పుడు సగట్టు సముద్రమట్టానికి 3.1 నుంచి 4.5 కి.మీ మధ్య విస్తరించి ఉంది.

ఏపీలో వర్షాలు…

ఉత్తర కోస్తాలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలుపడొచ్చు. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడుతాయి. 40- 50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. రేపు, ఎల్లుండి కూడా ఇలాంటి పరిస్థితి ఉండనున్నాయి.

దక్షిణ కోస్తాలో చూస్తే ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడొచ్చు. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడుతాయి. రేపు, ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇక రాయలసీమలో చూస్తే... ఇవాళ కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడొచ్చు. రేపు ఎల్లుండి చూస్తే... కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. ఇక రాగల రెండు రోజుల్లో గరిష్ణ ఉష్ణోగ్రతలనమోదులో క్రమంగా 2- 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆ తర్వాత గణనీయమైన మార్పు ఉండకపోవచ్చని పేర్కొంది.

తెలంగాణలోని ఈ జిల్లాలకు హెచ్చరికలు…

తెలంగాణలో చూస్తే ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతా్లలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

రేపు (జూన్ 06) జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లోహెచ్చరికలు జారీ అయ్యాయి.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More