విజయవాడలోని రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీస్ నుంచి ఉద్యోగ ప్రకటన అయింది. ఇందులో భాగంగా యంగ్ ప్రొఫెషనల్ పోస్టును రిక్రూట్ చేయనున్నారు. ఏడాది కాలానికిగానూ ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తారు. పని తీరు ఆధారంగా రెన్యూవల్ చేస్తారు. అర్హులైన అభ్యర్థులు…. డిసెంబర్ 16వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ వివరాలు:
- ఉద్యోగ ప్రకటన -రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీస్, విజయవాడ
- పోస్టు - యంగ్ ప్రొఫెషనల్
- ఖాళీల సంఖ్య - 01
- పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి. పనిచేసిన అనుభవం కూడా ఉండాలి. ప్రభుత్వ విభాగంలో పని చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషాల్లో ప్రావీణ్యం ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.
- ఎంపికైన వారు విజయవాడలోని ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయంలోనే పని చేయాలి.
- గరిష్ఠ వయోపరిమితి 40 ఏళ్లు మించకూడదు.
- ఎంపికైన వారికి నెలకు రూ.50,000 నుంచి రూ.60,000 మధ్య జీతం చెల్లిస్తారు.
- దరఖాస్తు విధానం - మెయిల్ ద్వారా దరఖాస్తును పంపాలి.
- ఎంపిక - ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
- మెయిల్ అడ్రస్ - rno.r, iiaya wacla@mea.gov. in
- అధికారిక వెబ్ సైట్ - https://services1.passportindia.gov.in/
ఈ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు

{{^htLoading}} {{/htLoading}}