విజయవాడ పాస్‌పోర్ట్ ఆఫీస్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ - మంచి జీతం, కేవలం ఇంటర్వ్యూనే...!

విజయవాడలో ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఇందులో భాగంగా యంగ్ ప్రొఫెషనల్ పోస్టును భర్తీ చేయనున్నారు.డిసెంబర్‌ 16వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు.

Published on: Dec 5, 2025, 12:01:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విజయవాడలోని రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీస్ నుంచి ఉద్యోగ ప్రకటన అయింది. ఇందులో భాగంగా యంగ్ ప్రొఫెషనల్ పోస్టును రిక్రూట్ చేయనున్నారు. ఏడాది కాలానికిగానూ ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తారు. పని తీరు ఆధారంగా రెన్యూవల్ చేస్తారు. అర్హులైన అభ్యర్థులు…. డిసెంబర్‌ 16వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు.

విజయవాడ పాస్‌పోర్ట్ ఆఫీస్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్
విజయవాడ పాస్‌పోర్ట్ ఆఫీస్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్

నోటిఫికేషన్ వివరాలు:

  • ఉద్యోగ ప్రకటన -రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీస్, విజయవాడ
  • పోస్టు - యంగ్ ప్రొఫెషనల్
  • ఖాళీల సంఖ్య - 01
  • పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి. పనిచేసిన అనుభవం కూడా ఉండాలి. ప్రభుత్వ విభాగంలో పని చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
  • హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషాల్లో ప్రావీణ్యం ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.
  • ఎంపికైన వారు విజయవాడలోని ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయంలోనే పని చేయాలి.
  • గరిష్ఠ వయోపరిమితి 40 ఏళ్లు మించకూడదు.
  • ఎంపికైన వారికి నెలకు రూ.50,000 నుంచి రూ.60,000 మధ్య జీతం చెల్లిస్తారు.
  • దరఖాస్తు విధానం - మెయిల్ ద్వారా దరఖాస్తును పంపాలి.
  • ఎంపిక - ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
  • మెయిల్ అడ్రస్ - rno.r, iiaya wacla@mea.gov. in
  • అధికారిక వెబ్ సైట్ - https://services1.passportindia.gov.in/

ఈ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More