నేషనల్ హైవే మీద నుంచి సర్వీస్ రోడ్డులోకి పల్టీలు కొట్టిన కారు.. నలుగురు యువకులు మృతి!
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో నలుగురు యువకులు మృతి చెందారు.
కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట దగ్గరలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి.. నేషనల్ హైవే మీద నుంచి సర్వీస్ రోడ్డులోకి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు అవ్వగా.. ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతు పరిస్థితి విషమించి అతడు మరణించాడు. అతివేగమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు ఏపీకి చెందినవారే.

ఇంటిపై కప్పు కూలి మహిళ మృతి
కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం వలసపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో సోమవారం ఇంటి పైకప్పు కూలిపోయి 40 ఏళ్ల వీరమ్మ అనే మహిళ మరణించింది. సమీపంలోని సిమెంట్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల కొండల నుండి ముడి పదార్థాలను వెలికితీస్తూ తరచుగా క్వారీ బ్లాస్టింగ్‌లు చేస్తుండటమే ఈ సంఘటనకు కారణమని స్థానికులు ఆరోపించారు. పదే పదే పేలుళ్ల కారణంగా వీరమ్మ ఇళ్లతో సహా గ్రామంలోని అనేక ఇళ్లలో పగుళ్లు ఏర్పడ్డాయని, వ్యవసాయ భూములు కూడా దెబ్బతిన్నాయని నివాసితులు ఆరోపించారు.
తాజా క్వారీ పేలుళ్ల కారణంగానే ఆమె మృతి చెందిందని స్థానికులు తెలిపారు. ఎర్రగుంట్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి, సబ్-ఇన్‌స్పెక్టర్ నాగ మురళి సంఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు ప్రారంభించారు. వీరమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని, నివాస ప్రాంతాలకు సమీపంలో క్వారీ కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు నిరసన చేపట్టారు.
హైదరాబాద్-విజయవాడ హైవే బస్సు ప్రమాదం
హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఒక ప్రైవేట్ ఆపరేటర్ బస్సు దగ్ధమైంది. ఈ సంఘటనలో 29 మంది ప్రయాణికులు తప్పించుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామం సమీపంలో హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్‌లోని కందుకూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి.
విహారి ట్రావెల్స్‌కు చెందిన ఈ ఏసీ స్లీపర్ కోచ్ బస్సు హైదరాబాద్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత బయల్దేరింది. చిట్యాల్ మండలంలోని పిట్టంపల్లి గ్రామానికి చేరుకోగానే బస్సులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను నిద్ర లేపాడు. వారు సకాలంలో బయటకు వచ్చారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


