...
...
Next Story

నంద్యాల జిల్లా : గన్ మిస్‌ఫైర్ - RPF కానిస్టేబుల్‌ మృతి

గన్ మిస్ ఫైర్ కావటంతో కానిస్టేబుల్‌ మృతిచెందాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా డోన్‌ రైల్వే స్టేషన్‌లోని జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది.

Published on: Jan 25, 2026, 13:16:58 IST
Advertisement

నంద్యాల జిల్లాలోని ఢోన్ రైల్వే స్టేషన్ లో ఆదివారం తెల్లవారుజామున గన్ మిస్ ఫైర్ అయింది. సర్వీస్ వెపన్ ను డిపాజిట్ చేస్తుండగా 50 ఏళ్ల ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గన్ మిస్ ఫైర్ (representative image ) (image source Pixel)
గన్ మిస్ ఫైర్ (representative image ) (image source Pixel)

తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కానిస్టేబుల్ పి పెద్దయ్య ఎస్కార్ట్ డ్యూటీ పూర్తి చేసిన తర్వాత రైలు దిగాడు. ఎస్కార్ట్ డ్యూటీ తర్వాత ఆయుధాన్ని డిపాజిట్ చేస్తున్నప్పుడు తుపాకీ మిస్ ఫైర్ అయింది. దీంతో కానిస్టేబుల్ పెద్దయ్య మృతి చెందాడు. బుల్లెట్ ముఖానికి తాకటంతో అక్కడికక్కడే మరణించాడని ఓ అధికారి పీటీఐకి తెలిపారు.

కానిస్టేబుల్ కుటుంబం ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ఉంటున్నట్లు సదరు అధికారి తెలిపారు. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 194 కింద రైల్వే పోలీసులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

మృతదేహాన్ని చూసి పెద్దయ్య భార్య, పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం తరఫున తక్షణ సహాయం కింద మృతుడి కుటుంబానికి రూ.లక్ష ఆర్థికసాయం అందించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks