మన్యం జిల్లాలో ఆర్టీసీ బస్సు దగ్ధం.. జయపురకు వెళ్తుండగా ఘటన!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఒడిశాకు చెందిన ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. ఈ ఘటనలో ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు భయం పుట్టిస్తున్నాయి. కర్నూలులో బస్సు దగ్ధం ఘటన మరవకముందే తెలంగాణలో ఆర్టీసీ బస్సుపై కంకర లోడు పడి ప్రయాణికులు మృతి చెందిన ఘటన జరిగింది. ఆ తర్వాత చిన్న చిన్న రోడ్డు ప్రమాద వార్తలు తరచూగా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రోడ్డవలస వద్ద ఆర్టీసీ బస్సు దగ్ధమైంది.

విశాఖ నుంచి జయపుర వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు కాలిపోయింది. ఉదయం 7.45 గంటలకు ఆంధ్రా-ఒడిశా ఘాట్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. ఇంజిన్‌లో నుంచి పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యారు. బస్సును పక్కకు ఆపేశారు. వెంటనే ప్రయాణికులు దిగిపోవాలని చెప్పారు. ఈ సమయంలో బస్సులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు కూడా వెంటనే అప్రమత్తమై దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. సమాచారం అందుకున్న సాలూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే.. ఘటనా స్థలానికి వచ్చి మంటలు అదుపు చేశారు. సకాలంలో డ్రైవర్ అలర్ట్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఆంధ్ర-ఒడిశా సరిహద్దుకు దగ్గరగా ఉన్న పాచిపెంట మండలంలోని రొడ్డవలస సమీపంలో ఈ సంఘటన జరిగింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని ప్రయాణికులు చెబుతున్నారు. డ్రైవర్ అప్రమత్తమయ్యారని తెలిపారు. కానీ ఒడిశా ఆర్టీసీ బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది.
బస్సు ప్రమాదం గురించి మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో మాట్లాడారు. ఎస్పీతో ఈ విషయం గురించి ఫోన్లో చర్చించారు. ప్రయాణికులకు ప్రమాదం లేదని తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తుల్లో జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. అంతకుముందు మంత్రి సంధ్యారాణి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే ప్రమాద స్థలానికి ఫైర్ ఇంజిన్ పంపారు.
బాపట్ల పట్టణంలో బైక్ యాక్సిడెంట్
మరోవైపు బాపట్ల పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గడియార స్తంభం కూడలి దగ్గర వేగంగా వస్తున్న బైక్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. వారిని గుంటూరు జిల్లా కొరిటపాడుకు చెందిన షేక్ రిజ్వాన్, చింతల నానిగా గుర్తించారు. చీరాల నుంచి గుంటూరు వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ మీద ఉన్న యువకులు ఎగిరి కిందపడి ఘటన స్థలంలోనే మరణించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


