శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు.. వైద్యారోగ్య శాఖ కీలక సూచన!

శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో భక్తులు తరలి వెళ్తున్నారు. ఇప్పటికే చాలా మంది శబరిమలకు వెళ్లారు. మరోవైపు కేరళ వైద్యారోగ్య శాఖ భక్తులకు కీలక సూచన చేసింది.

Published on: Nov 16, 2025, 20:15:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మండలపూజా మహోత్సవం-మకర విళక్కు తీర్థయాత్ర సీజన్ కోసం శబరిమలలోని అయ్యప్ప ఆలయం ఆదివారం సాయంత్రం తెరుచుకుంది. ఈ యాత్రకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు వస్తారు. రెండు నెలలకు పైగా తీర్థయాత్ర జరుగుతుంది. అయితే, ఆలయం తెరిచిన వెంటనే అయ్యప దర్శనానికి భక్తులు కొండపైకి తరలిరావడంతో సన్నిధానం, ట్రెక్కింగ్ మార్గాలు, బేస్ క్యాంపులు ఆదివారం నాడు భారీగా రద్దీని చూశాయి.

శబరిమల
శబరిమల

భక్తుల సమక్షంలో గర్భగుడిని తెరవడంతో ఆలయ ప్రాంగణం అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. రద్దీని నియంత్రించడానికి, అధికారులు వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా రోజువారీ యాత్రికుల సంఖ్యను 90,000-70,000కు, స్పాట్ బుకింగ్ ద్వారా 20,000కు పరిమితం చేశారు.

మండలపూజా మహోత్సవం, మకరవిళక్కు సమయంలో ఆలయం తెల్లవారుజామున 3 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది. అయ్యప్ప స్వామికి సాంప్రదాయ జోలపాట 'హరివరాసనం'తో ముగుస్తుంది. భక్తుల కోసం దేవస్థానం బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఆలయానికి చేరుకోవడానికి అనేక కిలోమీటర్లు నడిచే యాత్రికులకు నిరంతరాయంగా సురక్షితమైన తాగునీరు, విశ్రాంతి బెంచీలు, ఎండిన అల్లం నీరు, వేడి నీటిని పంపిణీ చేసే కేంద్రాలు వంటి సౌకర్యాలు ఉన్నాయి.

ఈ సీజన్‌లో ఆలయం, దాని ప్రాంగణంలో 24 గంటలూ సేవలందించడానికి వందలాది మంది పారిశుధ్య కార్మికులు పని చేస్తారు. సన్నిధానం, ట్రెక్కింగ్ మార్గాల వెంట బయో-టాయిలెట్లతో సహా అనేక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు సహాయం చేయడానికి బహుభాషా సమాచార బోర్డులను కూడా ఉంచారు.

యాత్రికుల ఏవైనా ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అనేక అత్యవసర వైద్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. రోజువారీ సందర్శకుల సంఖ్యను నియంత్రించడానికి వర్చువల్ క్యూ వ్యవస్థ ద్వారా కఠినమైన ఆదేశాలు అమలులో ఉన్నాయని అధికారులు తెలిపారు.

మరోవైపు కేరళ వైద్యారోగ్య శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. బ్రెయిన్ ఫీవర్ పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. కేరళలో ఇటీవల ప్రమాదకరమైన ప్రైమరీ అమీబిక్ మెనింజోఎన్సెఫలైటిస్ వ్యాధి, దీనిని బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఫీవర్ అని, మెదడు వాపు వ్యాధి అంటారు. జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు భక్తులను కోరారు. నదులు, చెరువులు, కాలువల్లో స్నానాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. నీటిలో Naegleria fowleri అనే అమీబా ఉండే అవకాశం ఉంది. ఇది ముక్కు ద్వారా మెదడుకు చేరుకుని ప్రమాదక పరిస్థితులకు దారితీయవచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More