Tirumala Jyesthabhishekam 2026 : జూన్ 26 నుంచి తిరుమల శ్రీవారి ‘సాలకట్ల జ్యేష్టాభిషేకం’ - ఈ సేవలన్నీ రద్దు

Tirumala Jyesthabhishekam 2026 : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జూన్ 26 నుండి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు సాలకట్ల జ్యేష్టాభిషేకం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 28న పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.

Published on: Jun 15, 2026, 12:12:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Tirumala Jyesthabhishekam 2026 : కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో జూన్ నెలలో మరో అత్యంత పవిత్రమైన సుదీర్ఘ సాంప్రదాయ ఉత్సవానికి సమయం అసన్నమైంది. శ్రీవారి ఆలయంలో జూన్ 26వ తేదీ నుంచి జూన్ 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు ‘సాలకట్ల జ్యేష్టాభిషేకం’ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటించింది. ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేలా ఈ ప్రత్యేక అభిషేక మహోత్సవాన్ని నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ.

తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయం

శ్రీవారి ఆలయ పరిధిలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణ మండపంలో ఈ పవిత్ర క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక పరిభాషలో ఈ ఉత్సవానికి ‘’అభిద్యేయక అభిషేకం’’ అనే మరొక విశిష్టమైన పేరు కూడా ఉంది.

తరతరాలుగా నిత్యం జరిగే వివిధ రకాల అభిషేకాలు, పూజాది క్రతువుల వల్ల అత్యంత ప్రాచీనమైన, పవిత్రమైన శ్రీవారి ఉత్సవమూర్తులు (శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి) అరిగిపోకుండా, ఎలాంటి డ్యామేజ్ జరగకుండా పరిరక్షించడమే ఈ జ్యేష్టాభిషేకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ మూడు రోజుల పాటు స్వామివారికి విశేష కవచ సమర్పణలు జరుగుతాయి:

  • మొదటి రోజు (జూన్ 26) : శ్రీ మలయప్పస్వామివారికి సంవత్సరం పొడవునా ఉన్న పాత బంగారు కవచాన్ని పూర్తిగా తీసివేస్తారు. అనంతరం ప్రత్యేక హోమాలు, పంచామృతాలతో ‘స్నపన తిరుమంజనం’ (పవిత్ర స్నానం) నిర్వహిస్తారు. ఆ తర్వాత స్వామివారికి అత్యంత దేదీప్యమానమైన వజ్రకవచాన్ని అలంకరించి పూజలు చేస్తారు.
  • రెండవ రోజు (జూన్ 27) : రెండో రోజు కూడా ప్రత్యేక తిరుమంజనాది కార్యక్రమాలు ముగిసిన తర్వాత స్వామివారికి నయనానందకరంగా ముత్యాల కవచాన్ని సమర్పిస్తారు.
  • మూడవ రోజు (జూన్ 28) : చివరి రోజున సాంప్రదాయబద్ధంగా తిరుమంజన ప్రక్రియలన్నీ పూర్తి చేసి, స్వామివారికి తిరిగి సరికొత్త బంగారు కవచాన్ని పునః సమర్పిస్తారు.

మూడవ రోజున స్వామివారికి అలంకరించే ఈ బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే ఏడాది జ్యేష్టాభిషేకం ఉత్సవం వరకు అస్సలు తీయరు. సంవత్సరం పొడవునా శ్రీవారు ఇదే బంగారు కవచాన్ని ధరించి నిత్యం జరిగే వివిధ బ్రహ్మోత్సవాలు, ఊరేగింపులు మరియు విభిన్న ఉత్సవాల్లో భక్తులకు దర్శనమిస్తారు.

జూన్ 28న ఆర్జిత సేవలు రద్దు :

తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్టాభిషేక వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్న నేపథ్యంలో.. ఉత్సవాల చివరి రోజైన జూన్ 28వ తేదీన ఆలయంలో నిర్వహించే పలు ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. రద్దయిన సేవల్లో కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, మరియు ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు ఉన్నాయి.

ఈ సేవల టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు ఈ మార్పును గమనించి సహకరించాలని…. నిబంధనల ప్రకారం వారికి దర్శన సదుపాయం కల్పించబడుతుందని అధికారులు తెలిపారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More