...
...
Next Story

అమెరికాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు.. సంప్రదాయం ఉట్టిపడేలా..!

యూఎస్‌‌లోని తెలుగువారు సంక్రాంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మన పండుగలు, సంప్రదాయాలు తెలిసేలా వేడుకలు చేశారు.

Published on: Jan 18, 2026, 21:27:18 IST
Advertisement

యూఎస్‌ వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో స్థిరపడిన తెలుగువారు ఈ వారాంతంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్(నైటా) ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా చిన్న పిల్లలకు భోగి పండ్లు పోశారు. స్థానిక సౌతర్న్ పార్క్ వేలో ఉన్న సాయి మందిర్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్సాహంగా ఈ వేడుకలో పాల్గొన్నారు.

అమెరికా సంక్రాంతి సంబరాలు
అమెరికా సంక్రాంతి సంబరాలు

అమెరికాలోనే పుట్టి పెరిగిన చిన్నారులకు మన పండుగలు, సంప్రదాయాలు తెలిసేలా పండుగలను ప్రతీ సంవత్సరం నైటా నిర్వహిస్తోంది. రేగు పండ్లు, నాణేలు, పూలు, చెరకు ముక్కలతో భోగి పండ్లు పోసి, పిల్లలందరూ శ్రీమన్నారాయణుడి ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలతో ఉండాలని పెద్దలందరూ దీవించారు.

పద్మశ్రీ నోరి దత్తాత్రేయుడు, పైళ్ల సాధన మళ్లారెడ్డి పిల్లలందరికీ ఆశీర్వచనాలు అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు అందరికీ నైటా తరపున బహుమతులు అందించారు. నైటా ప్రెసిడెంట్ రవీందర్ కోడెల, ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

హుస్టన్‌ నగరంలో సంక్రాంతి వేడుకలు

మరోవైపు హుస్టన్‌ నగరంలోనూ సంక్రాంతి సంబరాలను విజయవంతంగా నిర్వహించారు. హనుమాన్, దత్త యోగా కేంద్రం వేదికగా జరిగిన ఈ వేడుకల్లో తెలుగువారు ఉత్సహంగా పాల్గొన్నారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించారు. గురు నిలయం నుంచి ఈవెంట్ హాల్ వరకు నిర్వహించిన గంగిరెద్దుల ఊరేగింపు ప్రత్యేక ఆకర్శణగా నిలిచింది.

ఆడపడుచులు వేసిన రంగురంగుల ముగ్గులు ఆకట్టుకున్నాయి. సంప్రదాయబద్ధంగా పొయ్యి మీద వండిన పొంగలి వంటకాలు పండగ నిండుదనాన్ని పెంచాయి. ఐదేళ్లలోపు చిన్నారులకు నిర్వహించిన భోగి పండ్ల వేడుక సందడిగా జరిగింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe