AP School Holidays: ఏపీలో పాఠశాలలకు సంక్రాంతి, దసరా సెలవులు ఖరారు, ఈ ఏడాది సెలవులే సెలవులు
AP School Holidays: ఏపీలో పాఠశాలల వార్షిక విద్యా సంవత్సరం ఖరారైంది. స్కూళ్లకు నెలవారీ సెలవుల షెడ్యూల్ కూడా నిర్ణయించారు. ఈ ఏడాది 83 రోజుల పాటు స్కూళ్లకు సెలవులు దక్కాయి.
Published on: Jul 31, 2024, 10:40:54 IST
AP School Holidays: ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది పాఠశాలలకు 232 రోజులు పని దినా లుగా ప్రభుత్వం నిర్ణయించింది. 83 రోజులు సెలవులు దక్కనున్నాయి.

- ఈ ఏడాది దసరా సెలవులు అక్టోబరు 4 నుంచి 13 వరకు ఉంటాయి. క్రిస్టియన్ మైనారిటీ సంస్థ లకు కూడా దసరా సెలవుల్లో ఎలాంటి మార్పు లేదు.
- క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 22 నుంచి 29 వరకు ఇస్తారు.
- సంకాంత్రి సెలవులు 2025 జనవరి 10 నుంచి 19 వరకు ఉంటాయి. మైనారిటీ విద్యా సంస్థలకు మాత్రం జనవరి 11 నుంచి 15 వరకు సెలవులు ఇస్తారు.
- ఏపీలో ఈ విద్య సంవత్సరం 315రోజుల పాటు కొనసాగనుంది. జూన్ 13నుంచి పాఠశాలలు మొదలయ్యాయి. జూన్‌లో సెలవుల తర్వాత 18రోజులు మిగిలి ఉండగా 14రోజుల పాటు తరగతులు జరిగాయి. నాలుగు సెలవులు వచ్చాయి.
- జూలై 31 పనిదినాల్లో 25 రోజుల పాటు తరగతులు నిర్వహించారు. ఆరు రోజులు సెలవులు వచ్చాయి. ఆగస్టులో 31రోజుల్లో 24రోజుల పాటు తరగతులు జరుగుతాయి. ఏడ్రోజులు సెలవులు ఉంటాయి.
- సెప్టెంబర్‌లో 30రోజుల్లో 22 రోజుల పాటు తరగతులు నిర్వహిస్తారు. 8రోజుల సెలవులు లభిస్తాయి. అక్టోబర్‌లో దసరా సెలవుల నేపథ్యంలో 17రోజులు మాత్రమే తరగతులు జరుగుతాయి. మొత్తం 31 రోజుల్లో 14రోజులు సెలవులు లభిస్తాయి.
- నవంబర్‌లో 30 రోజుల్లో 25రోజుల పాటు తరగతులు జరుగుతాయి. 5రోజుల సెలవులు లభిస్తాయి. డిసెంబర్‌లో 31 రోజుల్లో 24రోజుల పాటు తరగతులు జరుగుతాయి. మైనార్టీ విద్యా సంస్థలకు 19రోజులు మాత్రమే తరగతులు జరుగుతాయి. సాధారణ విద్యా సంస్థలకు 7 రోజుల సెలవులు లభిస్తే క్రిస్టియన్ మైనార్టీ విద్యా సంస్థలకు 12రోజులు సెలవులు ఉంటాయి.
- జనవరిలో 31రోజుల్లో సంక్రాంతి సెలవులు మినహాయిస్తే 19 రోజుల పాటు తరగతులు జరుగుతాయి. మైనార్టీ విద్యా సంస్థలకు మాత్రం 24రోజుల పాటు తరగతులు నిర్వహిస్తారు. జనవరిలో సాధారణ విద్యా సంస్థలకు 12 రోజుల సెలవులు, మైనార్టీ సంస్థలకు ఏడు రోజుల సెలవులు లభిస్తాయి.
- ఫిబ్రవరిలో 28 రోజుల్లో 22రోజుల పాటు తరగతులు జరుగుతాయి. ఆరు రోజుల సెలవులు ఉంటాయి. మార్చిలో 3 రోజుల్లో 23 రోజుల సెలవులు ఉంటాయి. 8 రోజుల సెలవులు లభిస్తాయి. ఏప్రిల్‌లో 23 రోజులలో 17 రోజుల పాటు పాఠశాలలు పనిచేస్తాయి. ఆరు రోజుల సెలవులు లభిస్తాయి. మొత్తం 315 రోజుల్లో 232 రోజుల పాటు పాఠశాలలు పనిచేస్తాయి. 83 సెలవులు లభిస్తాయి.
- దసరా సెలవులు అక్టోబర్ 4 నుంచి 13వరకు , సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 19వరకు ఇస్తారు. క్రిస్టియన్ మైనార్టీ విద్యా సంస్థలకు అక్టోబర్ 4 నుంచి 13వరకు దసరా సెలవులు ఉంటాయి. క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుంచి 29వరకు ఇస్తారు. క్రిస్టియన్ విద్యాసంస్థలకు జనవరి 11 నుంచి 15వరకు ఇస్తారు.

ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
Home/Andhra Pradesh/AP School Holidays: ఏపీలో పాఠశాలలకు సంక్రాంతి, దసరా సెలవులు ఖరారు, ఈ ఏడాది సెలవులే సెలవులు
Home/Andhra Pradesh/AP School Holidays: ఏపీలో పాఠశాలలకు సంక్రాంతి, దసరా సెలవులు ఖరారు, ఈ ఏడాది సెలవులే సెలవులు

E-Paper


