అమరావతి వేదికగా నిర్వహించిన 8వ కలెక్టర్ల సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనా యంత్రాంగానికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఫైళ్లు పెండింగ్‌లో పడితే రాష్ట్ర ప్రగతి, పాలన కూడా నిలిచిపోయినట్టేనని స్పష్టం చేసిన సీఎం, అధికారులు ఇగోలు పక్కనపెట్టి ప్రజాసేవకులుగా బాధ్యతలు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. సమీక్ష సమావేశాలకే పరిమితం కాకుండా ఫలితాలు సాధించడమే ధ్యేయంగా పనిచేయాలని, వన్ స్టేట్ - వన్ మిషన్ - వన్ ఎయిమ్ సిద్ధాంతంతో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు కట్టుబడి ఉండాలని అధికారులను ఆదేశించారు.

పరిపాలనలో వేగం, పారదర్శకత పెంచేందుకు కలెక్టర్ల సమావేశంలో తొలిసారిగా లీడర్‌షిప్ స్కిల్స్‌పై ప్రత్యేక సెషన్‌ను నిర్వహించారు. రియాక్టివ్ పాలన కంటే ముందుచూపుతో కూడిన ప్రోయాక్టివ్ పాలన ప్రాధాన్యమైనదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
నిర్ణయాధికారంలో వేగం పెంచేందుకు డేటా లేక్, అవేర్ వంటి సాంకేతిక వ్యవస్థలను విస్తృతంగా వినియోగించాలని, డీప్ టెక్ గవర్నెన్స్‌తో అద్భుత ఫలితాలు సాధించవచ్చని చంద్రబాబు తెలిపారు. గతంలో 50 ఏళ్లలో జరిగే అభివృద్ధిని ఆధునిక సాంకేతికతతో ఇప్పుడు 10-15 ఏళ్లలోనే సాధించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగుల పనితీరు, సామర్థ్యాన్ని పెంచేందుకు ఇప్పటివరకు 1.50 కోట్ల కోర్సులను నిర్వహించినట్లు వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో అమల్లోకి తెచ్చిన మద్యం విధానంపై సీఎం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జే బ్రాండ్ కల్తీ మద్యం వల్ల గతంలో 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, వేలాది మంది ఆరోగ్యం దెబ్బతిందని మండిపడ్డారు. ప్రజారోగ్యంతో ఆడుకున్న ఆ కల్తీ బ్రాండ్లను రద్దు చేసి, ప్రస్తుతం అత్యంత పారదర్శకంగా, నాణ్యమైన మద్యం విక్రయాలను మాత్రమే అందుబాటులోకి తెచ్చామన్నారు.
ప్రతీ శాఖలోనూ సంస్కరణలు తీసుకొచ్చామని చంద్రబాబు అన్నారు. ఆర్థిక ప్రగతిని ప్రతినెలా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. 2022-23ను బేస్ ఇయర్‌గా పరిగణిస్తే.. ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్రం 13.44 శాతం వృద్ధి రేటును నమోదు చేసిందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ వృద్ధిని 15 శాతానికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. గతేడాదితో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు రూ. 25,450 కోట్ల మేర గణనీయంగా పెరిగాయని చంద్రబాబు వివరించారు.
ప్రజలపై విద్యుత్ టారిఫ్ భారం మోపకుండానే, నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరం పంపిణీ చేస్తున్నామని గుర్తుచేశారు. సామాజిక మాధ్యమాలు, ఇతర మార్గాల్లో జరుగుతున్న దుష్ప్రచారాలను అధికారులు తక్షణమే తిప్పికొట్టాలని సీఎం సూచించారు. ఫేక్ ప్రచారాలకు వేగంగా కౌంటర్ ఇవ్వకపోతే ఆ నష్టం ప్రభుత్వానికే చేరుతుందన్నారు. డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా సహా అన్ని భర్తీ ప్రక్రియలు నిబంధనల ప్రకారమే అత్యంత పారదర్శకంగా జరిగాయని స్పష్టం చేశారు. దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న ఇద్దరు మహిళా అధికారులను సభలో సీఎం ప్రత్యేకంగా అభినందించారు.
{{/usCountry}}ప్రజలపై విద్యుత్ టారిఫ్ భారం మోపకుండానే, నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరం పంపిణీ చేస్తున్నామని గుర్తుచేశారు. సామాజిక మాధ్యమాలు, ఇతర మార్గాల్లో జరుగుతున్న దుష్ప్రచారాలను అధికారులు తక్షణమే తిప్పికొట్టాలని సీఎం సూచించారు. ఫేక్ ప్రచారాలకు వేగంగా కౌంటర్ ఇవ్వకపోతే ఆ నష్టం ప్రభుత్వానికే చేరుతుందన్నారు. డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా సహా అన్ని భర్తీ ప్రక్రియలు నిబంధనల ప్రకారమే అత్యంత పారదర్శకంగా జరిగాయని స్పష్టం చేశారు. దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న ఇద్దరు మహిళా అధికారులను సభలో సీఎం ప్రత్యేకంగా అభినందించారు.
{{/usCountry}}రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు జిల్లా అధికారులకు సీఎం చంద్రబాబు పలు మార్గదర్శకాలను అందించారు. ప్రతి జిల్లాలో 25 టాప్ ప్రాజెక్టులను, ప్రతి నియోజకవర్గంలో 10-15 ప్రాధాన్యతా ప్రాజెక్టులను గుర్తించి వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. 2027 నాటికి రాష్ట్రంలో ఎలాంటి భూ వివాదాలు లేకుండా చూడాలని లక్ష్యంగా విధించారు.
రాష్ట్రంలో 54 శాతం లోటు వర్షపాతం నమోదవ్వడం, ఎల్ నినో ప్రభావం వల్ల నీటి భద్రత సవాలుగా మారిందని, తాగునీటి సరఫరాలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని సీఎం తేల్చిచెప్పారు. హంద్రీనీవా, వెలిగొండ ఫేజ్-1, పోలవరం ఎడమ కాలువ, భోగాపురం విమానాశ్రయం వంటి పనులను పరుగులు తీస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గత 27 నెలల్లో సంక్షేమానికి రూ. 1.40 లక్షల కోట్లు, అభివృద్ధికి రూ. 1.50 లక్షల కోట్లు వెచ్చించామని వివరించారు.