...
...
Next Story

రాజమండ్రిలో కల్తీ పాల కలకలం..! పలువురు మృతి, ఆస్పత్రుల్లో మరికొందరు బాధితులు

రాజమండ్రి నగర శివారు లాలాచెరువు పరిధిలో కల్తీపాలు తాగి పలువురు అస్వస్థ­తకు గురైన ఘటన వెలుగు చూసింది. జిల్లా అధికారులు రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురు మృతి చెందారు.

Published on: Feb 23, 2026, 11:05:04 IST
Advertisement

తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో కల్తీ పాలు కలకలం రేపాయి. లాలాచెరువు ప్రాంతంలోని చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్‌లో ఒకేసారి పలువురు(14 మంది వరకు) తీవ్ర అనారోగ్యంతో ఆసుప‌త్రి పాల‌వ్వ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.. బాధితుల‌కు కిడ్నీలు పాడైన‌ట్లు తెలుస్తోంది.. దీనంత‌ట‌కి క‌ల్తీ పాలే కార‌ణ‌మ‌న్న అనుమానాలు బాధితులు వ్య‌క్తం చేస్తున్నారు.

అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చేరిక….

కల్తీ పాలు కలకలం. (representative image ) (image pixel )
కల్తీ పాలు కలకలం. (representative image ) (image pixel )

ఈ ఏరియాల్లో గడిచిన మూడు నాలుగు రోజులుగా ఒక్కసారిగా డయేరియా, మూత్రపిండాల(కిడ్నీ) కేసులు అధికమయ్యాయి. వీరంతా కూడా ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే వీరిలో ఇప్పటికే నలుగురు మృతి చెందగా… మరికొంత మంది చికిత్స తీసుకుంటున్నారు. పాలు తాగిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురి కావటంతో పాల కల్తీ వ్వవహారం తెరపైకి వచ్చింది. చాలా మంది బాధితులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో విలవిలలాడుతున్నారు. వీరిలో కొందరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. శివరాత్రి రోజు తాగిన పాలు తేడాగా ఉన్నాయని పలువురు బాధితులు చెబుతున్నారు.

రంగంలోకి అధికారులు…

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో…. అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. కార‌ణాల‌ను అన్వేషించే పనిలో పడ్డారు. అంద‌రూ ఒకే చోట పాలు కొన‌డంతో.. క‌ల్తీ జ‌రిగింద‌ని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాలు తాగిన కాలనీలలో ఇంటింటా సర్వే చేపట్టారు. మున్సిపల్ హెల్త్ డిపార్ట్‌మెంట్, వైద్యులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ఇతర బృందం ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్నారు.

లాలాచెరువు, చౌడేశ్వరినగర్‌, స్వ‌రూప న‌గ‌ర్ ప్రాంతంలో అక‌స్మాత్తుగా అనారోగ్యంపాల‌వ్వ‌డం వెనుక కల్తీ పాలే కార‌ణ‌మ‌ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ కోణంలో విచారణ చేపట్టిన అధికారులు… పాల శాంపిల్స్‌ను సేక‌రించి ల్యాబ్‌కు పంపించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks