...
...
Next Story

తీరం దాటిన మొంథా తుఫాన్: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

తీవ్ర తుపానుగా మారిన మొంథా మంగళవారం రాత్రి నర్సాపురం వద్ద తీరం దాటింది. ఇది క్రమంగా బలహీనపడి తుపానుగా మారి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఉత్తరాంధ్ర గ్రామీణ ప్రాంతాల్లో 20 నుంచి 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Published on: Oct 29, 2025, 07:03:27 IST
Advertisement

అమరావతి, అక్టోబర్ 29: 'మొంథా' తుపాను తీవ్ర తుపానుగా మారి మంగళవారం రాత్రి నర్సాపూర్ వద్ద తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ (IMD) అధికారికంగా ప్రకటించింది.

విశాఖలో కారుపై కూలిన చెట్లు (HT_PRINT)
విశాఖలో కారుపై కూలిన చెట్లు (HT_PRINT)

తీవ్ర తుఫానుగా ఉన్న ‘మొంథా’ క్రమంగా తెల్లవారుజాము వరకు బలహీనపడి సాధారణ తుపానుగా మారింది.. తుపాను తీరం దాటే ప్రక్రియ కాకినాడ పరిసర ప్రాంతాల్లో మచిలీపట్నం, కళింగపట్నం మధ్య ప్రారంభమైంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురిశాయి. పలు చోట్ల ఈదురు గాలుల కారణంగా చెట్లు విరిగిపడ్డాయి. అధికారులు నష్టాలు అంచనా వేస్తున్నారు.

ఏపీలో 35 విమాన సర్వీసులు రద్దు

'మొంథా' తీవ్ర తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల్లో కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

తెలంగాణలోని శంషాబాద్ (Shamshabad) నుండి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి విమానాశ్రయాల మధ్య నడిచే 35 విమాన సర్వీసులు రద్దు అయ్యాయని జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ తెలిపింది.

కాకినాడ సమీపంలో తుపాను తీరం దాటుతున్న నేపథ్యంలో 30 ఇండిగో (IndiGo), రెండు ఎయిర్ ఇండియా (Air India), ఐదు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) విమానాలను రద్దు చేశారు. ప్రయాణికులు తమ విమానాల స్థితిని ముందుగానే తెలుసుకోవాలని విమానాశ్రయ అధికారులు సూచించారు.

ఒడిశాలో భారీ తరలింపు, 'జీరో క్యాజువాలిటీ' లక్ష్యం

తీవ్ర తుపాను 'మొంథా' ముప్పు నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం భారీగా సహాయక చర్యలు చేపట్టింది. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి మంగళవారం రాష్ట్ర సన్నద్ధతపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

దక్షిణ ఒడిశాలోని ఎనిమిది జిల్లాలు - గంజాం, గజపతి, రాయగడ, కోరాపుట్, మల్కాన్‌గిరి, కంధమాల్, కలహండి, నవరంగ్‌పూర్ – ఎక్కువగా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ముఖ్యమంత్రి మాఝి తెలిపారు.

"ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది. మా లక్ష్యం ఎప్పటిలాగే 'జీరో క్యాజువాలిటీ' (ప్రాణ నష్టం సున్నా) పాలసీకి కట్టుబడి ఉంది" అని ఆయన ప్రకటించారు.

ఇప్పటివరకు 11,396 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అదనంగా 30,000 మందికి పైగా ప్రజలను తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

సహాయక చర్యల కోసం 30 ఒడిశా డిజాస్టర్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ODRF) బృందాలు, 123 ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది, ఐదు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందాలను రంగంలోకి దించారు. మరిన్ని బృందాలను కూడా అప్రమత్తం చేసి ఉంచారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe