తిరుపతి ప్రయాణికులకు గుడ్ న్యూస్ - వన్ వే స్పెషల్ ట్రైన్స్ పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే

South Central Railway Special Trains : వేసవి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. నాందేడ్ - తిరుపతి, తిరుపతి - జాల్నా మధ్య నడిచే వన్-వే ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగించింది.

Published on: May 21, 2026, 14:45:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

South Central Railway Special Trains : రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) మరో అప్డేట్ ఇచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణించే వారి అదనపు రద్దీని క్లియర్ చేయడానికి, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడానికి వన్-వే ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకువచేలా నిర్ణయం తీసుకుంది.

వన్ వే స్పెషల్ ట్రైన్స్ పొడిగింపు
వన్ వే స్పెషల్ ట్రైన్స్ పొడిగింపు

ఈ పొడిగింపు నిర్ణయం ద్వారా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని పలు ప్రధాన నగరాల మధ్య ప్రయాణించే వారికి ఎంతో ఉపశమనం కలగనుంది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో ఈ వన్-వే ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.

  • నాందేడ్ – తిరుపతి వన్-వే స్పెషల్ (రైలు నంబర్: 07814) : హజూర్ సాహిబ్ నాందేడ్ నుంచి తిరుపతికి నడిచే ఈ వన్-వే ప్రత్యేక రైలు (Train No. 07814) గురువారం( 21 మే 2026) కూడా సర్వీసును అందిస్తుంది. ఈ మార్గంలో ప్రయాణించే భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
  • తిరుపతి – జాల్నా వన్-వే స్పెషల్ (రైలు నంబర్: 07815) : తిరుపతి నుంచి జాల్నాకు నడిచే తిరుగు ప్రయాణ వన్-వే ప్రత్యేక రైలు (Train No. 07815) శుక్రవారం (22 మే 2026) నాడు కూడా నడుస్తుంది. ఈ రెండు రైళ్లకు సంబంధించి ప్రస్తుతానికి ఒక్కొక్క సర్వీసును మాత్రమే పొడిగించినట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన టికెట్ బుకింగ్స్, స్టాపింగులు, సమయాల వివరాలను దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా ఐఆర్‌సీటీసీ (IRCTC) యాప్ ద్వారా ప్రయాణికులు సరిచూసుకోవచ్చు. ప్రయాణికుల రద్దీని బట్టి రాబోయే రోజుల్లో మరిన్ని రైళ్లను పొడిగించే అవకాశం ఉందని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More