SCR Weekly Train : తెలుగు ప్రయాణికులకు గుడ్ న్యూస్ - ధర్మవరం నుంచి వీక్లీ ఎక్స్‌ప్రెస్, హాల్ట్ స్టేషన్లు ఇవే

ప్రయాణికుల సౌకర్యార్థం ధర్మవరం - నాందేడ్ మధ్య కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి వచ్చింది. గతంలో నడిచిన స్పెషల్ రైలును రెగ్యులరైజ్ చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది.

Published on: May 18, 2026, 09:49:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ధర్మవరం - నాందేడ్ - ధర్మవరం మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు సేవలను క్రమబద్ధీకరించింది దీని స్థానంలో సరికొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును రైల్వే శాఖ అధికారికంగా ఆమోదించింది. ఈ కొత్త రైలు సర్వీస్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల్లోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణం మరింత సులభతరం కానుంది.

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
  • రైల్వే శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం…. రైలు నంబర్ 17635/17636 నాందేడ్ - ధర్మవరం - నాందేడ్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్ సర్వీసులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
  • రైలు నంబర్ 17636 (ధర్మవరం - నాందేడ్): ఈ సర్వీస్ మే 17, 2026 నుంచి అందుబాటులోకి వచ్చింది.
  • రైలు నంబర్ 17635 (నాందేడ్ - ధర్మవరం): ఈ సర్వీస్ మే 22, 2026 నుంచి ప్రతి శుక్రవారం అందుబాటులోకి రానుంది.
  • ఈ రైలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని నిజామాబాద్, వరంగల్, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి మీదుగా ప్రయాణిస్తుంది.

టైమింగ్స్ వివరాలు:

ఈ రైలు ప్రతి శుక్రవారం సాయంత్రం 16:45 గంటలకు నాందేడ్‌లో బయలుదేరుతుంది. నిజామాబాద్ కు 18:58 గంటలకు, వరంగల్ - 23:48 గంటలకు చేరుకుంటుంది. ధర్మవరానికి శనివారం రాత్రి 19:30 గంటలకు చేరుతుంది.

ధర్మవరం - నాందేడ్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 17636) ఈ రైలు ప్రతి ఆదివారం తెల్లవారుజామున 05:25 గంటలకు ధర్మవరంలో బయలుదేరుతుంది. కదిరికి 06:23 గంటలకు, తిరుపతికి 10:30 గంటలకు, విజయవాడకు సాయంత్రం 18:35 గంటలకు చేరుకుంటుంది. నాందేడ్ కు సోమవారం ఉదయం 08:05 గంటలకు చేరుకుంటుంది.

ఈ రెండు సర్వీసులు ముద్ఖేడ్, బాసర, ఆర్మూర్, కోరుట్ల, లింగంపేట జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, మహబూబాబాద్, ఖమ్మం, తెనాలి, బాపట్ల, చీరాల, పాకాల, మదనపల్లె రోడ్ స్టేషన్లలో కూడా ఆగుతాయి.

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ఈ రైలులో విభిన్న శ్రేణి కోచ్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం 20 కోచ్‌లు ఉంటాయి. వీటిలో సెకండ్ ఏసీ (2A), థర్డ్ ఏసీ (3A), స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లుంటాయి.

ఈ కొత్త రైలు సర్వీస్ నిజామాబాద్, కరీంనగర్ వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలకు… అలాగే విజయవాడ, తిరుపతి వైపు వెళ్లే ఏపీ ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More