...
...
Next Story

ఈ రైల్వే స్టేషన్‌లో శాతవాహన ఎక్స్‌ప్రెస్ తాత్కాలిక స్టాప్.. ఎందుకు అంటే?

శాతవాహన ఎక్స్‌ప్రెస్‌కు తాత్కాలిక స్టాప్ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే. ఎర్రపాలెం స్టేషన్‌లో ఈ టెంపరరీ స్టాపేజ్ ఉంటుంది.

Published on: Jul 1, 2026, 17:12:41 IST
Advertisement

ఖమ్మం జిల్లా జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక ఉత్సవానికి అధిక సంఖ్యలో భక్తుల హాజరుకానున్నారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే ట్రైన్ నెం.12713/12714 విజయవాడ - సికింద్రాబాద్ - విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైలుకు కొత్తగా హాల్టింగ్ ఇచ్చింది. 01.07.2026 నుండి 03.07.2026 వరకు ఎర్రుపాలెం రైల్వే స్టేషన్‌లో తాత్కాలిక స్టాపేజీని ఏర్పాటు చేశారు. 12713 ట్రైన్ ఎర్రుపాలెం స్టేషన్‌కు 07.05కి వచ్చి.. 07.06కి బయల్దేరుతుంది. 12714 ట్రైన్ రాత్రి 9.22 గంటలకు చేరుకుని.. 09.23కి బయల్దేరి వెళ్తుంది.

శాతవాహన ఎక్స్‌ప్రెస్
శాతవాహన ఎక్స్‌ప్రెస్

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో కొలువై ఉన్న ఈ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల పాలిట కొంగుబంగారంగా, తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచింది. నిత్యం వేలాది మంది భక్తులతో ఈ క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. ఈ ఆలయానికి వందల సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉంది. స్థానిక పురాణాల ప్రకారం.. పూర్వం జబాలి అనే మహర్షి ఇక్కడి గుట్టపై ఘోర తపస్సు చేశారు. ఆయన భక్తికి మెచ్చిన శ్రీమహావిష్ణువు, వేంకటేశ్వర స్వామి రూపంలో ఇక్కడ స్వయంభూవుగా వెలిశారని ప్రతీతి. జబాలి మహర్షి తపస్సు చేసిన ప్రాంతం కావడం చేతనే ఈ ఊరికి మొదట జబాలిపురం అని పేరు వచ్చిందని.. కాలక్రమేణా అది జమలాపురంగా రూపాంతరం చెందిందని చరిత్ర చెబుతోంది.

గుట్టపై వెలిసిన స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ఎంతో ఇష్టపడతారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న అలమేలు మంగమ్మ అమ్మవారు, పద్మావతి అమ్మవార్ల ఉప ఆలయాలు కూడా భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇక్కడి ప్రకృతి రమణీయత, ప్రశాంతమైన వాతావరణం భక్తులకు మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి.

ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల సమయంలో కేవలం ఖమ్మం జిల్లా నుంచే కాకుండా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ (కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల) నుండి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe