ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఒడిశాలోని పూరీలో జరిగే జగన్నాథుని రథయాత్రకు వెళ్లే భక్తుల కోసం సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన చేసింది. ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి, భక్తుల సౌకర్యార్థం విశాఖపట్నం - పూరీ - విశాఖపట్నం మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.

ట్రెయిన్ నెంబర్ 08551/08552 పరిధిలో ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లు ఖుర్దా రోడ్ జంక్షన్‌ను బైపాస్ చేస్తూ, అరుగుల్, హరిపూర్‌గ్రామ్ మీదుగా నడుస్తాయి. రైల్వే శాఖ ప్రకటన ప్రకారం ఈ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రెండు వైపులా రెండేసి ట్రిప్పుల చొప్పున వెళ్తాయి.
ట్రైన్ నెంబర్ 08551 (విశాఖపట్నం - పూరీ) రైలు జూలై 15, 2026 నుంచి జూలై 23, 2026 తేదీలలో సర్వీసులను అందిస్తుంది.
ట్రెయిన్ నెంబర్ 08552 (పూరీ - విశాఖపట్నం) తిరుగు ప్రయాణంలో ఈ రైలు జూలై 17, 2026 నుంచి జూలై 25, 2026 తేదీలలో అందుబాటులో ఉంటుంది.
ఈ రథయాత్ర స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలులో మొత్తం 12 కోచ్‌లు ఉంటాయి. వీటిలో GSLRD - 02, WGSCN - 04, GS - 06 కోచ్‌లు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.
స్టాప్‌లు
విశాఖపట్నం నుండి పూరీ రైలు విశాఖపట్నంలో మధ్యాహ్నం 12:30 గంటలకు బయలుదేరి, అదే రోజు రాత్రి 21:30 గంటలకు పూరీ చేరుకుంటుంది. మార్గమధ్యంలో ప్రధాన స్టేషన్ల టైమింగ్స్ చూస్తే విజయనగరం జంక్షన్: మధ్యాహ్నం 13:24 (రాక) / 13:29 (బయలుదేరుట), శ్రీకాకుళం రోడ్: మధ్యాహ్నం 14:22 / 14:27, పలాస: సాయంత్రం 15:45 / 15:50, బ్రహ్మపూర్: సాయంత్రం 16:45 / 16:50 ఆగుతుంది.
పూరీ నుండి విశాఖపట్నం ట్రైన్ తిరుగు ప్రయాణంలో పూరీలో అర్ధరాత్రి దాటిన తర్వాత 02:30 గంటలకు బయలుదేరి, అదే రోజు ఉదయం 11:05 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. బ్రహ్మపూర్: తెల్లవారుజామున 04:48 / 04:53, పలాస: ఉదయం 07:01 / 07:06, శ్రీకాకుళం రోడ్: ఉదయం 08:06 / 08:11, విజయనగరం జంక్షన్: ఉదయం 09:04 / 09:09కు ఆగుతుంది.
{{/usCountry}}పూరీ నుండి విశాఖపట్నం ట్రైన్ తిరుగు ప్రయాణంలో పూరీలో అర్ధరాత్రి దాటిన తర్వాత 02:30 గంటలకు బయలుదేరి, అదే రోజు ఉదయం 11:05 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. బ్రహ్మపూర్: తెల్లవారుజామున 04:48 / 04:53, పలాస: ఉదయం 07:01 / 07:06, శ్రీకాకుళం రోడ్: ఉదయం 08:06 / 08:11, విజయనగరం జంక్షన్: ఉదయం 09:04 / 09:09కు ఆగుతుంది.
{{/usCountry}}ఈ రైళ్లు ఆగే ఇతర స్టాప్‌లు చూసుకుంటే.. సింహాచలం, కొత్తవలస, చీపురుపల్లి, పొందూరు, తిలారు, కోటబొమ్మాళి, నౌపడ జంక్షన్, మందస, సోంపేట, ఇచ్చాపురం, ఛత్రపూర్, ఖల్లికోట్, బాలుగావ్, కాలుపారాఘాట్, నిరాకర్‌పూర్, మోతరి, కనాస్ రోడ్ పీహెచ్, దెలాంగ్, జెనాపూర్ రోడ్ పీహెచ్, బీరపురుషోత్తంపూర్, సాఖీ గోపాల్, జానకీదేఈపూర్ పీహెచ్ మరియు మాలతీపట్పూర్ వంటి మొత్తం 30 స్టేషన్లలో ఆగుతాయి.