ఆంధ్ర నుంచి పూరీ జగన్నాథ రథయాత్ర స్పెషల్ రైళ్లు.. పూర్తి షెడ్యూల్, స్టాప్‌లు ఇవే!

ఒడిశాలోని పూరీలో జగన్నాథుడి రథయాత్రకు ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది వెళ్తుంటారు. వారికోసం సౌత్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వాటి వివరాలను ఇక్కడ చూడండి.

Published on: Jul 10, 2026, 06:46:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఒడిశాలోని పూరీలో జరిగే జగన్నాథుని రథయాత్రకు వెళ్లే భక్తుల కోసం సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన చేసింది. ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి, భక్తుల సౌకర్యార్థం విశాఖపట్నం - పూరీ - విశాఖపట్నం మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.

పూరీ జగన్నాథ రతయాత్ర 2026 స్పెషల్ ట్రైన్స్
పూరీ జగన్నాథ రతయాత్ర 2026 స్పెషల్ ట్రైన్స్

ట్రెయిన్ నెంబర్ 08551/08552 పరిధిలో ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లు ఖుర్దా రోడ్ జంక్షన్‌ను బైపాస్ చేస్తూ, అరుగుల్, హరిపూర్‌గ్రామ్ మీదుగా నడుస్తాయి. రైల్వే శాఖ ప్రకటన ప్రకారం ఈ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రెండు వైపులా రెండేసి ట్రిప్పుల చొప్పున వెళ్తాయి.

ట్రైన్ నెంబర్ 08551 (విశాఖపట్నం - పూరీ) రైలు జూలై 15, 2026 నుంచి జూలై 23, 2026 తేదీలలో సర్వీసులను అందిస్తుంది.

ట్రెయిన్ నెంబర్ 08552 (పూరీ - విశాఖపట్నం) తిరుగు ప్రయాణంలో ఈ రైలు జూలై 17, 2026 నుంచి జూలై 25, 2026 తేదీలలో అందుబాటులో ఉంటుంది.

రథయాత్ర స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలులో మొత్తం 12 కోచ్‌లు ఉంటాయి. వీటిలో GSLRD - 02, WGSCN - 04, GS - 06 కోచ్‌లు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.

స్టాప్‌లు

విశాఖపట్నం నుండి పూరీ రైలు విశాఖపట్నంలో మధ్యాహ్నం 12:30 గంటలకు బయలుదేరి, అదే రోజు రాత్రి 21:30 గంటలకు పూరీ చేరుకుంటుంది. మార్గమధ్యంలో ప్రధాన స్టేషన్ల టైమింగ్స్ చూస్తే విజయనగరం జంక్షన్: మధ్యాహ్నం 13:24 (రాక) / 13:29 (బయలుదేరుట), శ్రీకాకుళం రోడ్: మధ్యాహ్నం 14:22 / 14:27, పలాస: సాయంత్రం 15:45 / 15:50, బ్రహ్మపూర్: సాయంత్రం 16:45 / 16:50 ఆగుతుంది.

పూరీ నుండి విశాఖపట్నం ట్రైన్ తిరుగు ప్రయాణంలో పూరీలో అర్ధరాత్రి దాటిన తర్వాత 02:30 గంటలకు బయలుదేరి, అదే రోజు ఉదయం 11:05 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. బ్రహ్మపూర్: తెల్లవారుజామున 04:48 / 04:53, పలాస: ఉదయం 07:01 / 07:06, శ్రీకాకుళం రోడ్: ఉదయం 08:06 / 08:11, విజయనగరం జంక్షన్: ఉదయం 09:04 / 09:09కు ఆగుతుంది.

ఈ రైళ్లు ఆగే ఇతర స్టాప్‌లు చూసుకుంటే.. సింహాచలం, కొత్తవలస, చీపురుపల్లి, పొందూరు, తిలారు, కోటబొమ్మాళి, నౌపడ జంక్షన్, మందస, సోంపేట, ఇచ్చాపురం, ఛత్రపూర్, ఖల్లికోట్, బాలుగావ్, కాలుపారాఘాట్, నిరాకర్‌పూర్, మోతరి, కనాస్ రోడ్ పీహెచ్, దెలాంగ్, జెనాపూర్ రోడ్ పీహెచ్, బీరపురుషోత్తంపూర్, సాఖీ గోపాల్, జానకీదేఈపూర్ పీహెచ్ మరియు మాలతీపట్పూర్ వంటి మొత్తం 30 స్టేషన్లలో ఆగుతాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More