నరసాపూర్‌ టూ సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు.. అనకాపల్లి నుంచి కూడా.. ఈ రూట్లలో పలు రైళ్లు రద్దు !

రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. నరసాపూర్–సికింద్రాబాద్, అనకాపల్లి–సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టుగా ప్రకటించింది. మరోవైపు పనుల కారణంగా కొన్ని రైళ్లను అధికారులు రద్దు చేశారు.

Published on: Nov 11, 2025, 15:34:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రద్దీ సమయంలో దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. తాజాగా రద్దీని తగ్గించడానికి స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్టుగా ప్రకటించింది. ప్రయాణికుల అదనపు రద్దీని తీర్చడానికి దక్షిణ మధ్య రైల్వే నరసాపూర్–సికింద్రాబాద్, అనకాపల్లి–సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

రైలు నెం. 07455 నరసపూర్ - సికింద్రాబాద్ (ఒక సర్వీస్).. 12 నవంబర్ 2025న ఉంటుంది. ఈ రైలు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ జంక్షన్, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టాప్‌లలో ఆగుతుంది.

అలాగే రైలు నం. 07179 అనకాపల్లి - సికింద్రాబాద్ (ఒక సర్వీస్) 15 నవంబర్ 2025న ఉంది. స్టాప్‌లు: తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి ఉన్నాయి.

పనుల కారణంగా రైళ్లు రద్దు

విజయవాడ-దువ్వాడ సెక్షన్‌లో తుని-హంసవరం-అన్నవరం-రావికంపాడు స్టేషన్‌ల మధ్య ఆటోమేటిక్ సెక్షన్‌ను ప్రారంభించేందుకు నాన్-ఇంటర్‌లాకింగ్ (ఎన్ఐ) పనుల కారణంగా, 20 నవంబర్ 2025న కింది రైళ్లు రద్దు అవుతాయి.

17267 కాకినాడ పోర్ట్ - విశాఖపట్నం, 17268 విశాఖపట్నం - కాకినాడ పోర్ట్, 67285 రాజమండ్రి - విశాఖపట్నం, 67286 విశాఖపట్నం - రాజమండ్రి రైళ్లను రద్దు చేశారు.ప్రయాణీకులు గమనించి తదనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More