Tirumala : సెప్టెంబర్ 15 నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు - ఇవాళ మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ

Tirumala Brahmotsavams 2026 : తిరుమలలో శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని ఇవాళ మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ(ట్రయల్ రన్) జరగనుంది. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.

Published on: Aug 28, 2026, 09:44:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Tirumala Brahmotsavams 2026 : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 'మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ' నేడు అత్యంత వైభవంగా జరగనుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

బ్రహ్మోత్సవ గరుడసేవ
బ్రహ్మోత్సవ గరుడసేవ

ఇష్ట వాహనంపై మలయప్ప స్వామి దర్శనం

శుక్రవారం(ఇవాళ) రాత్రి 7 గంటల నుండి 9 గంటల మధ్య శ్రీ మలయప్పస్వామివారు తన అత్యంత ఇష్టమైన గరుడ వాహనంపై నాలుగు మాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనభాగ్యం కల్పిస్తారు. ప్రతి ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందుగానే ఈ మాదిరి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ప్రధాన ఉత్సవాలకు ముందస్తు ఏర్పాట్లు, భద్రత, రద్దీ నియంత్రణ వంటి అంశాలను బేరీజు వేసుకునేందుకు ఈ వేడుక ఎంతగానో దోహదపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

సెప్టెంబర్ 15 నుండి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

ఈ ఏడాదికి సంబంధించిన శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుండి సెప్టెంబర్ 23 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ తొమ్మిది రోజుల పాటు వివిధ వాహనాలపై స్వామివారు భక్తులకు అభయమివ్వనున్నారు. బ్రహ్మోత్సవాలకు దేశ విదేశాల నుండి లక్షలాదిగా తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ యంత్రాంగం ముందస్తు ప్రణాళికలు రచిస్తోంది.

మాదిరి బ్రహ్మోత్సవాలు, రాబోయే సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆలయ నాలుగు మాడవీధుల్లోని గ్యాలరీలలో భక్తులకు కల్పిస్తున్న వసతులు, తాగునీరు, ఇతర ఇంజినీరింగ్ పనులను వివిధ విభాగాధిపతులతో కలిసి వారు స్వయంగా పరిశీలిస్తున్నారు. భక్తులకు ఏ చిన్న అసౌకర్యం కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More