Srikakulam Stampede Video : శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట వీడియో.. సాయం కోసం కేకలు వేసిన మహిళలు!
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 9 మంది మరణించారు. ఇందులో 8 మంది మహిళలు, 12 సంవత్సరాల బాలుడు ఉన్నారు. ఏకాదశి పర్వదినం కావడంతో భక్తులు భారీగా ఆలయానికి వచ్చారు. రెయిలింగ్ ఊడి పడి ప్రమాదం జరిగింది. సుమారు 25 మంది వరకు గాయపడ్డారు. స్పృహతప్పి పడిపోయారు. క్షతగాత్రులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో బయటకు వచ్చింది. వీడియోలో జనాలు క్యూ లైన్లో చిక్కుపోయినట్టుగా కనిపిస్తుంది. సాయం కోసం ఏడుస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇరుకైన మార్గంలో మెట్ల దగ్గర ఇరుక్కుపోయిన భక్తులు తొక్కిసలాట నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. సంఘటన సమయంలో మహిళలు సహాయం కోసం కేకలు వేస్తూ కనిపించారు.
గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు అంబులెన్స్‌లలో తీసుకెళ్తున్న దృశ్యాలను కూడా వీడియోలో ఉన్నాయి.
తొక్కిసలాట తనకు బాధ కలిగించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మృతులకు సంతాపాన్ని తెలియజేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు PMNRF నుండి ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్-గ్రేషియా ప్రకటించారు.
సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. 'శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలోని వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట సంఘటన దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ విషాద సంఘటనలోభక్తుల మరణం చాలా హృదయ విదారకం. గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని నేను అధికారులను ఆదేశించాను.' అని చంద్రబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణనష్టం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
'కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట అనేక మంది భక్తుల మరణానికి కారణమైంది, ఇది తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తొక్కిసలాటలో గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్స అందిస్తోంది. సమాచారం అందిన వెంటనే నేను అధికారులు, జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషతో మాట్లాడాను. బాధిత వ్యక్తులకు తక్షణ సహాయం అందించాలని ఆదేశించాను.' అని మంత్రి నారా లోకేష్ అన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


