శ్రీకాకుళం జిల్లా : కాశీబుగ్గలో తీవ్ర విషాదం - ఆలయంలో తొక్కిసలాట… 9 మంది భక్తులు మృతి…!
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది భక్తులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనలో 9 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కార్తీక మాసం శనివారం, పైగా ఏకాదశి కావటంతో భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూలైన్లలో తోపులాట జరిగటంతో…. రెయిలింగ్ విరిగిపోవటంతో ఈ విషాదం జరిగినట్టు సమాచారం.

ఇక ఈ ఆలయాన్ని నాలుగేళ్ల క్రితమే ప్రారంభించారు. సుమారు రూ.20 కోట్లతో నిర్మాణ జరిగింది. కొత్తగా నిర్మించిన ఆలయంలో మే నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ప్రతి శనివారం ఈ ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తారు. ఈ క్రమంలోనే… ఏకాదశి కావటంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
అత్యంత విషాదం - సీఎం చంద్రబాబు
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. “శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటన కలచివేసింది. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయాల పాలైన వారికి మేలైన సత్వర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాను. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా స్థానిక అధికారులను, ప్రజాప్రతినిధులను కోరాను” అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన విడుదల చేశారు.
కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయ తొక్కిలాట దుర్ఘటనపై హోం మంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన గురించి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. “ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందచేయాలని అధికారులను ఆదేశించాను. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలగా అండగా ఉంటుంది” అని పేర్కొన్నారు.
ఘటనాస్థలికి మంత్రి అచ్చెన్నాయుడు
ఈ ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి హుటాహుటిన బయల్దేరి వెళ్లారు. ఘటన గురించి దేవాలయ అధికారులతో మాట్లాడారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందచేయాలని సూచించారు.
మరోవైపు ఘటనా స్థలంలోని పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలానికి అదనపు పోలీసు బలగాలు తరలిస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

