జర్నలిస్ట్ కొమ్మినేనికి ఊరట..! విడుదలకు ఆదేశాలు, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనికి ఊరట లభించింది. తన అరెస్టును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. కొమ్మినేని తరపున న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఈ మేరకు ఆయన్ను విడుదల చేయాలని ఆదేశిస్తూ బెయిల్ ఇచ్చింది. విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు ఊరట లభించింది. వెంటనే విడుదల చేయాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు… బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం… కీలక వ్యాఖ్యలు చేసింది. విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఏం సంబంధమని ప్రశ్నించింది. నవ్వితే మాత్రం అరెస్ట్ చేస్తారా..? అని వ్యాఖ్యానించింది. ఆయన 70 సంవత్సరాల వయస్సు గల సీనియర్ జర్నలిస్ట్ అని గుర్తు చేసింది.

కొమ్మినేనిని వెంటనే బెయిల్ పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైన షరతులను ట్రయల్ కోర్టు విధిస్తుందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కొమ్మినేని జైలు నుంచి ఇవాళే విడుదలయ్యే అవకాశం ఉంది.
అసభ్యకర వ్యాఖ్యలను సమర్థించలేదు…!
విచారణ సందర్భంగా…. కొమ్మినేనితరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పలు అంశాలను ప్రస్తావించారు. మూడేళ్లలోపు శిక్ష పడే నేరాలకు పోలీసులు ముందుగా 41 కింద నోటీసు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయని గుర్తు చేశారు. నోటీసు ఇవ్వకుండానే అక్రమంగా అరెస్టు చేశారని… సుప్రీంకోర్టు తీర్పును పోలీసులు పాటించలేదన్నారు. లైవ్ షో లో గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు యాంకర్ ఎలా బాధ్యత వహిస్తారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయవద్దని గెస్ట్ ను… యాంకర్ కొమ్మినేనినియంత్రించారని గుర్తు చేశారు. అలాంటి వ్యాఖ్యాలను ఆయన సమర్థించలేదన్నారు.
తెలంగాణలో అరెస్ట్ చేసి 331 కి.మీ దూరంలోని ఆంధ్రప్రదేశ్ లో రిమాండ్ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ట్రాన్సిట్ రిమాండ్ తీసుకోలేదన్నారు. కొమ్మినేని సీనియర్ జర్నలిస్ట్ అని… ఆయనకు ఎలాంటి నేర చరిత్ర లేదన్నారు. 70 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్ అని… స్థానిక కోర్టులో కొమ్మినేని తరఫున న్యాయవాదిని కూడా అనుమతించలేదని వాదించారు. సహజ న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధమన్నారు. ప్రాథమిక హక్కు ఆర్టికల్ 19, 21, 22(1)ను ఉల్లంఘించారని చెప్పారు. మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని…వాక్ స్వాతంత్రానికి భంగం కలిగిస్తున్నారని ప్రస్తావించారు. అక్రమ అరెస్టుతో ఆయన హక్కులకు భంగం కలిగిందన్నారు.
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్త్ ధవే వాదనలు వినిపించారు.ఒక షో నిర్వహిస్తున్న జర్నలిస్ట్… వాటితో సంబంధం లేదనటం సరికాదన్నారు. ఈ చర్యలన్నీ ప్రేరేపితమే అని వ్యాఖ్యానించారు. డిబేట్ లో గెస్ట్ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయటాన్ని ప్రోత్సహించాడని..పైగా నవ్వుతున్నారని వాదించారు. కోర్టు కలగజేసుకుంటూ… కేసుల విచారణ సందర్భంగా పలు సందర్భాల్లో మనం కూడా నవ్వుకుంటాం కదా అని గుర్తు చేసింది. అయినా నవ్వినంత మాత్రానా అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించింది. ఆయన 70 సంవత్సరాల వయస్సు గల సీనియర్ జర్నలిస్ట్ అని గుర్తు చేసింది.
ఇరువైపు వాదనలు విన్న జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. సాక్షి టీవీ డిబేట్‌లో అమరావతిమహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో జూన్ 9వ తేదీన కొమ్మినేనిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper


