'దర్యాప్తు చేయాల్సిందే'.... ACB కేసులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు - ఏపీ హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేత..!
అవినీతి కేసుల్లో పలు ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.ఏసీబీ నమోదు చేసిన అన్ని ఎఫ్ఐఆర్లపై దర్యాప్తు చేయాల్సిందే అని స్పష్టం చేసింది. ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
అవినీతి కేసుల్లో నమోదైన కొన్ని ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. ఎఫ్ఐఆర్లను రద్దు చేయడానికి హైకోర్టు "అనవసరమైన శ్రమ" తీసుకుందంటూ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

ఏసీబీ నమోదు చేసిన అన్ని ఎఫ్ఐఆర్లపై దర్యాప్తు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎఫ్‌ఐఆర్‌లు కొట్టేయడం కుదరదని తేల్చి చెప్పింది. రద్దు చేసిన ఎఫ్‌ఐఆర్‌లపై ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ ఎంఎం సుంద్రేష్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది.
గత ఏడాది ఆగస్టులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)తో పాటు పలువురు దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారించిస్తూ… తీర్పును వెలువరించింది."మా అభిప్రాయం ప్రకారం… హైకోర్టు విధానం న్యాయాన్ని అపహాస్యం చేయడం తప్ప మరొకటి కాదు. హైపర్ టెక్నికల్ ప్రాతిపదికన ఎఫ్ఐఆర్లను కొట్టివేయటం సరికాదు. చట్టం యొక్క ప్రాథమిక నియమాలకు విరుద్ధం" అని అభిప్రాయపడింది. ఈ సందర్భంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)లోని సెక్షన్ 2(ఎస్)ను సుప్రీంకోర్టు ప్రస్తావించింది.
ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్‌కు నోటిఫైడ్ పోలీస్ స్టేషన్ హోదా లేదని ఏపీ హైకోర్టు… పలు ఎఫ్ఐఆర్‌లను కొట్టేసింది. ఈ క్రమంలో ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్.. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ)విజయవాడ నమోదు చేసిన అన్ని ఎఫ్ఐఆర్లపై దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఈ ఎఫ్ఐఆర్‌లపై 6 నెలల్లో తుది నివేదిక సమర్పించాలని కోరింది.
ఆయా కేసుల్లో ప్రతివాదులుగా ఉన్నవారు దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని సుప్రీంకోర్టు సూచించింది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లపై, పెండింగ్‌లో ఉన్న దర్యాప్తులపై ఎలాంటి పిటిషన్‌లను హైకోర్టు స్వీకరించవద్దు అని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విభజన(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) తర్వాత చట్టాలను మార్చకుంటే పాత చట్టాలు అమల్లో ఉన్నట్లేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

