చిత్తూరులో ఘోరం రోడ్డు ప్రమాదం జరిగింది. నగరంలోని ఇరువరంలో కారుపై కంటైనర్ పడింది. ఈ ప్రమాదంతో కారు నుజ్జునుజ్జయింది. దీంతో అందులో ఉన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనుదీప్ అక్కడికక్కడే మృతిచెందారు.
మృతుడి అనుదీప్ స్వగ్రామం గుడిపాల మండలం రామాపురం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించిన సీసీ పుటేజీ వెలుగులోకి వచ్చింది.
ఈ ప్రమాదంపై చిత్తూరు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… ఈ ప్రమాదం శుక్రవారం(ఇవాళ) ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఇరువరం గ్రామంలో జరిగిందని తెలిపారు. కంటైనర్ వాహనం.. కారుపై పడిపోవడంతో డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు అని పీటీఐకి చెప్పారు. కంటనైర్ బరువు దాటికి డ్రైవర్ తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందని వివరించారు.
కంటైనర్ పూర్తిగా కారు మీద పడటంతో కారు నుజ్జునుజ్జు అయింది. జేసీబీల సహయంతో స్థానికులు… మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు అనుదీప్…. బెంగళూరులోని విప్రో కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అతను స్వగ్రామానికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన సమయంలో కారులో అనుదీపక్ ఒక్కడే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అతని ఐడీ కార్డు ఆధారంగా గుర్తించారు.
ఈ ఘటనపై చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. మృతుడి కుటుంబానికి సంతాపం తెలిపారు. ప్రమాదంపై పరిస్థితిపై అధికారులకు ఫోన్ చేసిన సమాచారం తెలుసుకున్నారు. ప్రయాణాలు చేసే సమయంలో గమ్యం చేరే వరకు ప్రయాణికుల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
{{/usCountry}}ఈ ఘటనపై చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. మృతుడి కుటుంబానికి సంతాపం తెలిపారు. ప్రమాదంపై పరిస్థితిపై అధికారులకు ఫోన్ చేసిన సమాచారం తెలుసుకున్నారు. ప్రయాణాలు చేసే సమయంలో గమ్యం చేరే వరకు ప్రయాణికుల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
{{/usCountry}}