చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం : కారుపై పడిన భారీ కంటైనర్‌ - సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి స్పాట్ డెడ్, వీడియో రికార్డ్

చిత్తూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. నగరంలోని ఇరువరంలో కారుపై కంటైనర్‌ పడింది. ఈ ప్రమాదంతో కారు నుజ్జునుజ్జయింది. దీంతో అందులో ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అనుదీప్‌ అక్కడికక్కడే మృతిచెందారు. సీసీ పుటేజీ వెలుగులోకి వచ్చింది.

Published on: Feb 13, 2026, 15:08:33 IST
PTI | By , Chittoor
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చిత్తూరులో ఘోరం రోడ్డు ప్రమాదం జరిగింది. నగరంలోని ఇరువరంలో కారుపై కంటైనర్‌ పడింది. ఈ ప్రమాదంతో కారు నుజ్జునుజ్జయింది. దీంతో అందులో ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అనుదీప్‌ అక్కడికక్కడే మృతిచెందారు.

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం

మృతుడి అనుదీప్ స్వగ్రామం గుడిపాల మండలం రామాపురం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించిన సీసీ పుటేజీ వెలుగులోకి వచ్చింది.

ఈ ప్రమాదంపై చిత్తూరు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… ఈ ప్రమాదం శుక్రవారం(ఇవాళ) ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఇరువరం గ్రామంలో జరిగిందని తెలిపారు. కంటైనర్ వాహనం.. కారుపై పడిపోవడంతో డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు అని పీటీఐకి చెప్పారు. కంటనైర్ బరువు దాటికి డ్రైవర్ తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందని వివరించారు.

కంటైనర్ పూర్తిగా కారు మీద పడటంతో కారు నుజ్జునుజ్జు అయింది. జేసీబీల సహయంతో స్థానికులు… మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు అనుదీప్…. బెంగళూరులోని విప్రో కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అతను స్వగ్రామానికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన సమయంలో కారులో అనుదీపక్ ఒక్కడే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అతని ఐడీ కార్డు ఆధారంగా గుర్తించారు.

ఈ ఘటనపై చిత్తూరు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. మృతుడి కుటుంబానికి సంతాపం తెలిపారు. ప్రమాదంపై పరిస్థితిపై అధికారులకు ఫోన్ చేసిన సమాచారం తెలుసుకున్నారు. ప్రయాణాలు చేసే సమయంలో గమ్యం చేరే వరకు ప్రయాణికుల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More