...
...
Next Story

ఈనెల 29 నుంచి శ్రీకపిలేశ్వరాలయంలో తెప్పోత్సవాలు

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 29 నుంచి తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. జ‌న‌వ‌రి 2వ తేదీ వరకు ఈ తెప్పోత్సవాలు ఉంటాయి. ఇందుకు సంబంధించిన వివరాలను టీటీడీ ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.

Published on: Dec 18, 2025, 17:41:04 IST
Advertisement

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 29 నుంచి జ‌న‌వ‌రి 2వ తేదీ వరకు తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఐదు రోజులపాటు జరిగే తెప్పోత్సవాలలో మొదటిరోజైన డిసెంబ‌రు 29వ తేదీన శ్రీ వినాయక స్వామివారు, శ్రీ చంద్ర‌శేఖ‌ర్ స్వామివారు పుష్కరిణిలో 9 చుట్లు విహరిస్తారు.

తెప్పలపై దర్శనం…

శ్రీ కపిలేశ్వరాలయంలో తెప్పోత్సవాలు
శ్రీ కపిలేశ్వరాలయంలో తెప్పోత్సవాలు

న‌వంబ‌రు 30న శ్రీ వ‌ళ్ళి దేవ‌సేన స‌మేత శ్రీ సుబ్రమణ్యస్వామివారు 9 చుట్లు, డిసెంబ‌రు 31న‌ శ్రీ సోమస్కందస్వామివారు 9 చుట్లు, జ‌న‌వ‌రి 1న‌ శ్రీ కామాక్షి అమ్మవారు 9 చుట్లు, జ‌న‌వ‌రి 2న‌ శ్రీ చండికేశ్వరస్వామివారు మ‌రియు శ్రీ చంద్రశేఖర స్వామివారు తెప్పలపై 9 చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు.

ప్రతిరోజూ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు ఊంజ‌ల సేవ‌, తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. జనవరి 3వ తేదీన ఆరుద్ర దర్శన మహోత్సవం సందర్భంగా ఉదయం 6 నుండి రాత్రి 9 గంటల వరకు శ్రీ నటరాజస్వామివారు, శ్రీ శివగామి అమ్మవారు, శ్రీ మాణిక్యవాసగ స్వామివారి ఉత్సవ విగ్రహాలను పురవీధులలో ఊరేగించనున్నారు. తెప్పోత్సవాల సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంకీర్తనలు ఆలపిస్తారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks