తిరుమలలో పొలిటికల్ ఫ్లెక్సీతో తమిళనాడు భక్తుల ఓవరాక్షన్.. టీటీడీ సీరియస్!
తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర తమిళనాడు యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అన్నా డీఎంకే ఫ్లెక్సీని తీసుకొచ్చారు. దీనిపై టీటీడీ కూడా సీరియస్‌గా స్పందించింది.
తిరుమలలో తమిళనాడు నుంచి వచ్చిన భక్తులు ఓవరాక్షన్ చేశారు. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం కూడా సీరియస్ అయింది. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

ఇంతకీ ఏమైందంటే.. తిరుమల శ్రీవారి ఆలయం వద్దకు తమిళనాడు భక్తులు అన్నా డీఎంకే ఫ్లెక్సీతో వచ్చారు. దీనితో కాసేపు హల్చల్ చేశారు. ఫ్లెక్సీని ప్రదర్శించి, రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అన్నా డీఎంకేకు సంబంధించి.. జయలలిత, పళని స్వామి, ఇతర నేతల ఫొటోలు ఉన్న ఫ్లెక్సీని తిరుమలకు తీసుకొచ్చారు. ఆలయం దగ్గరలో ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ.. వీడియో తీసుకున్నారు. ఫొటోలు దిగారు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఈ ఘటనపై టీటీడీ స్పందించింది. 'తమిళనాడుకు చెందిన కొందరు వ్యక్తులు శ్రీవారి ఆలయ పరిసరాల్లో రాజకీయ నాయకుల ఫొటలతో ఉన్న ఫ్లెక్సీ బ్యానర్‌ను టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా ప్రదర్శించినట్టుగా మా దృష్టికి వచ్చింది. ఆ బ్యానర్‌ను ప్రదర్శించమే కాకుండా రీల్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు తెలిసింది. సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని టీటీడీ తెలియజేస్తోంది.' అని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.
తిరుమల గురించి ప్రచారం అయ్యే నకిలీ వార్తలు, తప్పుదారి పట్టించే సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని దేవస్థానం ఈ సందర్భంగా మరోసారి చెప్పింది. భక్తులు అధికారిక ప్రకటనలు, ధృవీకరించిన టీటీడీ ప్లాట్‌ఫామ్‌లపై మాత్రమే ఆధారపడాలని విజ్ఞప్తి చేసింది.
ఈ ఫ్లెక్సీ అలిపిరి దగ్గర తనిఖీలు దాటి పైకి ఎలా వచ్చిందనేది చర్చనీయాంశంగా మారింది. పొలిటికల్ ఫ్లెక్సీ ప్రదర్శిస్తూ.. వీడియోలు, ఫొటోలు తీసుకుంటుంటే.. భద్రతా సిబ్బంది పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర, మాఢ వీధుల్లో రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు, గుర్తులు, జెండాలు.. ఏవీ ప్రదర్శన చేయకూడదు. టీటీడీ నిషేధం విధించింది.
తిరుమలలో రాజకీయపరమైన వ్యాఖ్యలు కూడా చేయకూడదని రూల్ ఉంది. శ్రీవారి ఆలయం, మాఢ వీధుల్లో రీల్స్ కూడా చేయకూడదు. ఈ మేరకు నిబంధనలు ఉన్నా.. పలువురు భక్తులు ఉల్లంఘిస్తున్నారు. ఇతర భక్తులు అసౌకర్యాన్ని కలిగిస్తున్నారు. భక్తులకు టీటీడీ రోజూ మైక్‌లో ఇలాంటివాటిపై అవగాహన కల్పిస్తూనే ఉంటుంది. కానీ కొందరు మాత్రం నిబంధనలను పట్టించుకోవడం లేదు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper












