వారసత్వ భూముల విషయంలో ఉన్న ఇబ్బందులకు ఏపీ సర్కార్ చెక్ పెట్టేసింది. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయటమే కాకుండా అతి తక్కువ ఫీజునే నిర్ణయించింది. ఈ సేవలను రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 9వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉనఅన అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఇందుకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు. ఈ సేవల ప్రారంభించటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ - ముఖ్యమైన పాయింట్లు:
- వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో ఉన్న ఇబ్బందులకు చెక్ పెట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ. 100కే రిజిస్ట్రేషన్ చేసేలా కొన్ని నెలల కిందంటే నిర్ణయం తీసుకుంది.
- ఈ తరహా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ను లభతరం చేయటంతో పాటు రిజిస్ట్రేషన్లను ప్రోత్సహించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవలే ప్రభుత్వం జీవో జారీచేసింది.
- భూయజమానులు మరణించిన అనంతరం వారసులకు సంక్రమించే వాటికి మాత్రమే ఈ ఫీజులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
- వీలునామా రాయకుండా యజమాని మరణిస్తే వారసులు ఆ ఆస్తులను భాగాలు చేసుకొని లిఖితపూర్వకంగా ఏకాభిప్రాయంతో వస్తే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ.100, రూ.1000కే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
- ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ.10 లక్షల లోపు ఉంటే రూ.100 చొప్పున నామమాత్రపు స్టాంపు డ్యూటీ చెల్లించాలి.
- ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ.10 లక్షలు మించితే రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది.
- రైతులు తమకు వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకుంటే… ఆటోమేటిక్‌గా ఆ భూముల యాజమాన్యం వారి పేరు మీదకు వస్తుంది. దీనివల్ల వారికి పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయబడతాయి.
- నామమాత్రపు స్టాంపు డ్యూటీతో చేసుకునే ఈ తరహా రిజిస్ట్రేషన్లు కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తాయి. ఇతర ఆస్తులకు వర్తించవు.
- ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కలుగుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}