ఏపీ పదో తరగతి పరీక్షల్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే షెడ్యూల్ విడుదల కాగా… మార్చి 20వ తేదీన జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్ష తేదీ మారే అవకాశం ఉంది. ఈ పరీక్షను మార్చి 21వ తేదీకి మార్పు చేసే ఛాన్స్ ఉంది. దీనిపై ప్రభుత్వానికి ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రతిపాదనలు పంపింది.

ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం మార్చి 20న రంజాన్ పండగ ఉండటంతో ఈ మార్పు చేసేందుకు ప్రతిపాదనలు పంపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే…. ఈ ఒక్క తేదీ మారనుంది. మిగతా పరీక్షలు యథావిథిగా జరిగే అవకాశం ఉంది. రేపోమాపో అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే విడుదలైన షెడ్యూల్ ప్రకారం… ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16న ప్రారంభమై ఏప్రిల్ ఒకటితో ముగుస్తాయి. అయితే మార్చి 20వ తేదీన జరగబోయే ఇంగ్లీష్… మార్చి 21వ తేదీకి మారినప్పటికీ… మిగతా పరీక్షల పాత షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి.
ఏపీ టెన్త్ పరీక్షలు - ఏ పరీక్ష ఎప్పుడంటే...?
- మార్చి 16, 2026 – ఫస్ట్ లాంగ్వేజ్
- మార్చి 18, 2026 – సెకండ్ లాంగ్వేజ్
- మార్చి 20, 2026 - ఇంగ్లీష్
- మార్చి 23, 2026 – గణితం(మ్యాథ్స్)
- మార్చి 25, 2026 – ఫిజిక్స్
- మార్చి 28, 2026 – బయాలజీ
- మార్చి 30 , 2026 – సోషల్ స్టడీస్
- మార్చి 31, 2026 – ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్ 2)
- ఏప్రిల్ 1, 2026 – ఒకేషనల్ కోర్సు