Alluri District Tragedy : అల్లూరి జిల్లాలో విషాదం - నీట మునిగి ముగ్గురు బాలురు మృతి

Alluri District Tragedy : అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాద ఘటన జరిగింది. మత్స్యగెడ్డ వాగులో చేపలు పట్టేందుకు వెళ్లి ముగ్గురు బాలురు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. 

Published on: Apr 12, 2026, 17:52:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. సరదాగా చేపలు పట్టేందుకు వెళ్లిన నలుగురు చిన్నారులను మృత్యువు కబళించింది. మత్స్యగెడ్డ వాగులో నీట మునిగి ముగ్గురు బాలురు ప్రాణాలు కోల్పోగా, ఒకరు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

అల్లూరి జిల్లాలో విషాదం
అల్లూరి జిల్లాలో విషాదం

ప్రాథమిక వివరాల ప్రకారం… పన్నెడా గ్రామానికి చెందిన నలుగురు బాలురు మత్స్యగెడ్డ వాగుకు వెళ్లారు. చేపలు పట్టడంతో పాటు ఈత కొట్టేందుకు ప్రయత్నించారు. వీరిలో నలుగురు ప్రమాదవశాత్తు మునిగిపోగా.. మరొకరు బయటకు వచ్చి సహాయం కోసం కేకలు వేశారు. సమీపంలోని మత్స్యకారులు తక్షణమే స్పందించి.. ఒకరిని కాపాడగలిగారు. మిగిలిన ముగ్గురూ ప్రాణలు కోల్పోయారు.

హర్షిత్‌ (12), ప్రదీప్‌ (11), పాంగి బబులు (10)గా మృతులుగా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

స్కూళ్లకు వెళ్తూ… కళ్లముందే తిరిగే చిన్నారులు విగతజీవులుగా పడి ఉండటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒకేసారి గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు మృతి చెందడంతో గ్రామం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. మృతుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు చూసి స్థానికులు కన్నీరు ఆపుకోలేకపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వేసవి వేళ స్థానికంగా ఉండే వాగులు, చెరువులు, కుంటలకు వెళ్లేందుకు వెళ్తుంటారు. అయితే ఈత రాకపోవటం లేదా లోతును సరిగా అంచనా వేయకపోవటం వంటి కారణాలతో… ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇటీవలే కాలంలో చాలా చోట్ల ఈ తరహా ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అయితే ముఖ్యంగా చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More