Vizianagaram Road Accident : విజయనగరం జిల్లా బుర్జ సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక లారీ, ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మానాపురం వైపు నుంచి వస్తున్న మార్గంలో ఈ ప్రమాదం జరిగింది" అని బొబ్బిలి డీఎస్పీ ఆర్. గోవిందరావు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదం జరగడానికి గల కారణాలేమిటో తెలుసుకునేందుకు పోలీసులు సమీపంలోని సీసీటీవీ దృశ్యాలను, స్థానికుల ప్రకటనలను సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాడంగి మండలం గజరాయుని వలస గ్రామానికి చెందిన గుణుపూరు తిరుపతి ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన రైతు తెర్లి ఆదినారాయణతో కలిసి తిరుపతి అర్ధరాత్రి వేళ గజపతినగరం నుంచి తన ఆటోలో తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో పెద్దమానపురం వద్దకు రాగానే, చేపల వ్యాపారి అయిన గుడ్ల రాము కూడా వీరి ఆటో ఎక్కాడు.
ఆటో ప్రయాణం కొనసాగుతుండగా…. షికారుగంటి కూడలి వద్దకు చేరుకోగానే ఎదురుగా అత్యంత వేగంతో వచ్చిన ఒక లారీ, వీరి ఆటోను బలంగా ఢీకొట్టింది. లారీ వేగానికి ఆటో తీవ్రంగా నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాద తీవ్రతకు ఆటో డ్రైవర్ గుణుపూరు తిరుపతి, రైతు తెర్లి ఆదినారాయణ, చేపల వ్యాపారి గుడ్ల రాము తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
రోడ్డున పడ్డ మూడు కుటుంబాలు
ఈ దారుణ ప్రమాదం మూడు కుటుంబాల్లో కోలుకోలేని తీవ్ర శోకాన్ని నింపింది. మృతుల్లో ఆటో డ్రైవర్ తిరుపతికి భార్య పార్వతి, ఇద్దరు పిల్లలు దివ్య, హేమంత్ ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న తిరుపతి మరణించడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.
{{/usCountry}}ఈ దారుణ ప్రమాదం మూడు కుటుంబాల్లో కోలుకోలేని తీవ్ర శోకాన్ని నింపింది. మృతుల్లో ఆటో డ్రైవర్ తిరుపతికి భార్య పార్వతి, ఇద్దరు పిల్లలు దివ్య, హేమంత్ ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న తిరుపతి మరణించడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.
{{/usCountry}}మరో మృతుడు తెర్లి ఆదినారాయణ వ్యవసాయం చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు పిల్లలు కాగా, కుమార్తె కామేశ్వరికి ఇప్పటికే వివాహమైంది. ఉన్నపళంగా కుటుంబ యజమానులు దారుణ ప్రమాదంలో మరణించడంతో బాధితుల ఇళ్లల్లో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న దృశ్యాలు ప్రతీ ఒక్కరినీ కలచివేస్తున్నాయి.