Vizianagaram Road Accident : విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం - ఆటోను ఢీకొట్టిన లారీ, అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం!
Vizianagaram Road Accident : ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
Vizianagaram Road Accident : విజయనగరం జిల్లా బుర్జ సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక లారీ, ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మానాపురం వైపు నుంచి వస్తున్న మార్గంలో ఈ ప్రమాదం జరిగింది" అని బొబ్బిలి డీఎస్పీ ఆర్. గోవిందరావు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదం జరగడానికి గల కారణాలేమిటో తెలుసుకునేందుకు పోలీసులు సమీపంలోని సీసీటీవీ దృశ్యాలను, స్థానికుల ప్రకటనలను సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాడంగి మండలం గజరాయుని వలస గ్రామానికి చెందిన గుణుపూరు తిరుపతి ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన రైతు తెర్లి ఆదినారాయణతో కలిసి తిరుపతి అర్ధరాత్రి వేళ గజపతినగరం నుంచి తన ఆటోలో తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో పెద్దమానపురం వద్దకు రాగానే, చేపల వ్యాపారి అయిన గుడ్ల రాము కూడా వీరి ఆటో ఎక్కాడు.
ఆటో ప్రయాణం కొనసాగుతుండగా…. షికారుగంటి కూడలి వద్దకు చేరుకోగానే ఎదురుగా అత్యంత వేగంతో వచ్చిన ఒక లారీ, వీరి ఆటోను బలంగా ఢీకొట్టింది. లారీ వేగానికి ఆటో తీవ్రంగా నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాద తీవ్రతకు ఆటో డ్రైవర్ గుణుపూరు తిరుపతి, రైతు తెర్లి ఆదినారాయణ, చేపల వ్యాపారి గుడ్ల రాము తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
రోడ్డున పడ్డ మూడు కుటుంబాలు
ఈ దారుణ ప్రమాదం మూడు కుటుంబాల్లో కోలుకోలేని తీవ్ర శోకాన్ని నింపింది. మృతుల్లో ఆటో డ్రైవర్ తిరుపతికి భార్య పార్వతి, ఇద్దరు పిల్లలు దివ్య, హేమంత్ ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న తిరుపతి మరణించడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.
మరో మృతుడు తెర్లి ఆదినారాయణ వ్యవసాయం చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు పిల్లలు కాగా, కుమార్తె కామేశ్వరికి ఇప్పటికే వివాహమైంది. ఉన్నపళంగా కుటుంబ యజమానులు దారుణ ప్రమాదంలో మరణించడంతో బాధితుల ఇళ్లల్లో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న దృశ్యాలు ప్రతీ ఒక్కరినీ కలచివేస్తున్నాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

