East Godavari : తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం - రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతి
తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. యర్నగూడెం వద్ద ఉన్న జాతీయ రహదారిపై 2 కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దేవరపల్లి మండల పరిధిలోని యర్నగూడెం వద్ద ఉన్న జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొనగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు గాయపడ్డారు.
పోలీసుల వివరాల ప్రకారం…. రాజమండ్రి వైపు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ కారు… డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ప్రమాద దాటికి స్పాట్ లోనే ముగ్గురు చనిపోయారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానిక వాహన దారులు… వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారికి అంబులెన్స్ సహాయంలో హాస్పిటల్‌కు తరలించారు. కార్లలో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ప్రమాదంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు క్రెయిన్ సహాయంలో రెండు వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించారు. దీంతో ట్రాఫిక్ కు లైన్ క్లియర్ అయింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

