ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం - ముగ్గురు యువకులు మృతి
ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భీమడోలు మండలం సూరప్పగూడెం వద్ద ప్రమాదం బైక్‌పై వెళ్తున్న ముగ్గురిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
ఏలూరు జిల్లా ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గం భీమడోల్ మండల పరిధిలో ఘోర ప్రమాదం చోటు చేసుంది. సూరప్పగూడెం గ్రామంలో శనివారం తెల్లవారుజామున ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో బైక్ పై ఉన్న ముగ్గురు యువకులు మృతి చెందారు.
మృతుల్లో ఇద్దరు ద్వారక తిరుమల గ్రామానికి చెందినవారు కాగా… మూడో వ్యక్తి తిమ్మపురం గ్రామానికి చెందినవారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారని భీమడోల్ ఇన్స్పెక్టర్ జోసెఫ్ విల్సన్ తెలిపారు. కేసు నమోదు చేశామని… కేసు దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.మరోవైపు సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. సయ్యద్ రఫీ (19), కొయ్యగూర శ్రీరామ్ (22), మానరాజు చరణ్ కుమార్ (26)ను మృతులుగా గుర్తించారు.
ఈ ఘటనపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యువత రహదారి భద్రతా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆయన కోరారు. సురక్షితమైన రహదారులను నిర్ధారించడానికి కఠినమైన చర్యలను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

