మారేడుమిల్లిలో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి!

మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కీలక నేతలు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. మరికొందరు లొంగిపోయారు. తాజాగా మావోయిస్ట్ పార్టీ అగ్రనేత హిడ్మా మృతి చెందారు.

Published on: Nov 18, 2025, 10:57:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ పడింది. తాజాగా మావోయిస్టు అగ్రనేత హిడ్మాతోపాటుగా మరికొందరు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఆయన భార్య, అనుచరులు కూడా మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఎన్‌కౌంటర్‌లో హిడ్మా మృతి
ఎన్‌కౌంటర్‌లో హిడ్మా మృతి

ఉదయం 6 గంటల నుంచి ఏడు గంటల మధ్య ఎదురు కాల్పులు మెుదలు అయ్యాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్‌లో ఆరుగురు మావోయిస్టుల మృతి చెందారు. అందులో మావోయిస్టు అగ్రనేత హిడ్మా కూడా ఉన్నారు. కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మృతి చెందిన వారిలో హిడ్మా, అతడి భార్య రాజీ అలియాస్ రాజక్క, చెల్లూరి నారాయణ అలియాస్ సురేశ్, టెక్ శంకర్, మల్లా, దేవే ఉన్నారు.

భద్రతా దళాలు, పౌరులపై కనీసం 26 సాయుధ దాడులకు నాయకత్వం వహించిన పేరుమోసిన మావోయిస్టు నాయకుడు మడవి హిడ్మా హతమయ్యాడని అధికారులు కూడా ధృవీకరించారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల ట్రై-జంక్షన్ సమీపంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇక్కడ అనేక మావోయిస్టు స్థావరాలు ఉన్నాయి. ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించామని, ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

హిడ్మా అనేక దాడుల్లో ప్రధాన పాత్ర పోషించారు. 2010లో దంతెవాడలో జరిగిన దాడిలో 76 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో హిడ్మా ప్లానింగ్ చాలా ఉందని అంటారు. దానితోపాటుగా అనేక కీలక దాడుల్లో హిడ్మా ఉన్నారు. హిడ్మా మీద రూ.కోటి, ఆయన భార్యపై రూ.50 లక్షల రివార్డు ఉంది.

ఈ ఎన్‌కౌంటర్ ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య జరిగిందని ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. 'ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్ర నాయకుడు సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం భారీ కూంబింగ్ ఆపరేషన్ జరుగుతోంది.' అని డీజీపీ అన్నారు.

ఇటీవల లొంగిపోయిన అనేక మంది కీలక మావోయిస్టు నాయకులలో మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ భూపతి, తక్కళపల్లి వాసుదేవ రావు అలియాస్ ఆశన్న ఉన్నారు. మల్లోజుల ఆయుధాలతో సహా లొంగిపోయారు. అయితే ఆశన్న మాత్రం తమది లొంగుబాటు కాదని ప్రకటన చేశారు. జనంలోకి వచ్చి ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. తమతో కలిసి వచ్చేవారు చెప్పాలని ఇరువురు అగ్రనేతలు పిలుపునిచ్చారు. వీరితోపాటుగా వందల మంది మావోయిస్టులు లొంగిపోయారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More