తిరుమల : లక్కీ డిప్ విధానం రద్దు - అంగప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలో మార్పులు..!
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. అంగప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలో మార్పు చేసింది. లక్కీ డిప్ విధానాన్ని రద్దు చేసి FIFO (First In First Out) పద్ధతిలో టోకెన్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.
అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పడు అమల్లో ఉన్న లక్కీ డిప్ విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. ఇకపై FIFO (First In First Out) పద్ధతిలో టోకెన్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది.

టీటీడీ తీసుకున్న తాజా నిర్ణయంతో అంగ ప్రదక్షిణ టోకెన్లు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో విడుదల అవుతాయి. ఈ మార్పును గమనించి భక్తులు…. అంగప్రదక్షిణ టోకెన్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.
నిజానికి ఈ ఏడాది ఆగస్టు నెలలోనే అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో టీటీడీ మార్పు తీసుకొచ్చింది. అప్పటి వరకు అమల్లో ఉన్న ఫిఫో ( ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్) పద్ధతి స్థానంలో లక్కీ డిప్ విధానాన్ని ప్రవేశపెట్టింది. టోకెన్లను మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో లక్కీ డిప్ సిస్టమ్ ద్వారా విడుదల చేసింది. అయితే ఈ విధానంపై భక్తులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. పలు అభ్యంతరాలను కూడా టీటీడీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంనే… టీటీడీ లక్కీడిప్ విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది.
శ్రీవారి సారె ట్రయల్ రన్:
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన నవంబరు 25న పంచమీ తీర్థం సందర్భంగా తిరుమల నుండి వచ్చే శ్రీవారి సారె ఊరేగింపు ట్రయల్ రన్ గురువారం విజయవంతంగా నిర్వహించారు.
తిరుపతిలోని చెన్నారెడ్డి కాలనీలో గల శ్రీ వినాయక స్వామివారి ఆలయం నుండి శ్రీవారి సారె ఊరేగింపు ట్రయల్ రన్ మొదలైంది. అక్కడి నుండి ఏనుగుపై సారెను ఊరేగింపుగా తీసుకొచ్చారు.
ముందుగా శ్రీ కోదండరామాలయం, చిన్నబజారు వీధి, పాత హుజుర్ ఆఫీస్, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం, బండ్ల వీధి, ఆర్‌టిసి బస్టాండు, పద్మావతి పురం, మార్కెట్ యార్డు, శిల్పారామం మీదుగా తిరుచానూరులోని పసుపు మండపం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుండి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దగల మండపానికి సారెను వేంచేపు చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

