తిరుమల : కళ్యాణకట్ట, లడ్డూ కౌంటర్ వద్ద హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు - టీటీడీ కీలక నిర్ణయాలు
శ్రీవారి భక్తుల ఫీడ్ బ్యాక్ ఆధారంగా టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలోని కళ్యాణకట్ట, లడ్డూ కౌంటర్ వద్ద హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా అన్నప్రసాదాలు, పరిశుభ్రత, లగేజీ కౌంటర్ నిర్వహణపై కూడా ఆయా అధికారులకు పలు సూచనలు చేసింది.
తిరుమలోని కళ్యాణకట్ట, లడ్డూ కౌంటర్ వద్ద హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు అధికారులకు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు భక్తులకు ఎప్పటికప్పుడు మరింత మెరుగైన సకర్యాలు కల్పించేందుకు టీటీడీ అభిప్రాయ సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఐవీఆర్ఎస్, వాట్సాప్, శ్రీవారి సేవకుల ద్వారా భక్తుల నుండి క్రమంగా అభిప్రాయాలను సేకరించడం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పద్మావతి విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో శనివారం సమీక్ష నిర్వహించారు. భక్తుల నుండి అక్టోబర్ నెలలో సేకరించిన అభిప్రాయాలపై విభాగాల వారీగా చర్చించారు. వీటి ఆధారంగా పలు ఆదేశాలను జారీ చేశారు.
ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఆదేశాలు…
ఈ సందర్భంగా ఆయన అభిప్రాయాలపై అధికారులతో చర్చిస్తూ పలు అదేశాలు జారీ చేశారు. కాలిబాట మార్గాల్లో పంచాయతీ, ఆరోగ్య విభాగాలు కలసి తరచూ తనిఖీలు నిర్వహించి ఆ మార్గాల్లోని దుకాణాల్లో వస్తువుల ధరలను పర్యవేక్షించాలన్నారు.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించేటప్పుడు అన్న ప్రసాదం సిబ్బంది చేతులకు తొడుగులు ధరించి ప్రసాదాలు వడ్డించాలని సూచించారు. భక్తులు చేతులు కడుగు ప్రదేశం, హాళ్లలో తడి లేకుండా పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
లగేజీ కౌంటర్ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా భక్తులకు సకాలంలో లగేజీ అందేలా సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని చెప్పారు. భక్తులు గదుల కాషన్ డిపాజిట్ తిరిగిపొందడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రిసెప్షన్ విభాగం చర్యలు తీసుకోవాలన్నారు. ఏటీసీ నుండి ఆక్టోపస్ సర్కిల్ వరకు ఉండే క్యూలైన్లలో భక్తులకు అన్న ప్రసాదం, తాగునీరు అందేలా అధికారులు నిత్యం క్యూలైన్లను పర్యవేక్షించాలన్నారు.
అదేవిధంగా క్యూలైన్లు, కంపార్ట్ మెంట్లలో పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని ఆదేశించారు. అన్న ప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్, క్యూలైన్ల నిర్వహణ, లడ్డూ కౌంటర్ విభాగాలపై వచ్చిన భక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పారు. తదుపరి సమావేశంలో వాటి పురోగతిపై రిపోర్టు సమర్పించాలని చెప్పారు.
అనంతరం గోపార్క్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి ప్రజెంటేషన్ ఇచ్చారు. తిరుమలలోని పార్కింగ్ సమస్య పరిష్కారాలకు పార్కింగ్ యాప్ అభివృద్ధి, స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్రణాళిక, పార్కింగ్ ప్రీ బుకింగ్, నిర్దేశిత పార్కింగ్ జోన్లు గుర్తింపు, తదితర అంశాలను వివరించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

