11 నెలల్లో రూ. 900 కోట్లు - తిరుమల శ్రీవారికి భారీగా విరాళాలు, లెక్కలు ఇలా…

తిరుమల శ్రీవారికి భారీ స్థాయిలో విరాళాలు అందుతున్నాయి. గడిచిన ఈ 11 నెలల్లో రూ.900 కోట్లకు పైగా విరాళాలు అందుకున్నట్లు టీటీడీ తెలిపింది. ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ ద్వారా ఈ విరాళాలు వచ్చినట్లు వెల్లడించింది.

Published on: Oct 22, 2025, 17:08:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ స్థాయిలో విరాళాలు అందుతున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను టీటీడీ వెల్లడించింది. నవంబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 మధ్య వివిధ ట్రస్టులకు రూ.918.6 కోట్ల విరాళాలు అందాయని వివరించింది.

తిరుమల
తిరుమల

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ…. ట్రస్టులకు విరాళాలు క్రమంగా పెరిగాయన్నారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో ఈ విరాళాలను ఇస్తున్నారని చెప్పారు. అందుకున్న విరాళాల్లో రూ.579.38 కోట్లు ఆన్లైన్ ద్వారా రాగా… మరో రూ.339.20 కోట్లు ఆఫ్ లైన్ మార్గంలో వచ్చాయని ప్రకటించింది.

విరాళాల వివరాలు ఇలా….

వచ్చిన వాటిల్లో అన్నదానం ట్రస్టుకు అత్యధికంగా రూ.339 కోట్లు, శ్రీవాణి ట్రస్టుకు రూ.252 కోట్లు, బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.98 కోట్లు అందాయి. ఎస్వీ ప్రాణాదన ట్రస్టుకు రూ.67 కోట్లు, ఎస్వీ గోసారక్షన ట్రస్టుకు రూ.56 కోట్లు, ఎస్వీ విద్యాదనం ట్రస్టుకు రూ.33.47 కోట్లు ముట్టాయి. ఇక బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ది డిజేబుల్డ్స్ (బర్డ్) ట్రస్టుకు రూ.30 కోట్లు, ఎస్వీ సర్వశ్రేయస్ ట్రస్టుకు రూ.20.46 కోట్లు వచ్చాయని టీటీడీ ఛైర్మన్ బీఆర్ఎస్ నాయుడు తెలిపారు.

ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ.13.87 కోట్లు, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ)కి రూ.6.29 కోట్లు, శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్వీఐఎంఎస్)కు రూ.1.52 కోట్లు విరాళంగా ఇచ్చారు. విరాళాల కోసం ఎక్కువ మంది దాతలు ఆన్ లైన్ మార్గానికే ఆసక్తి చూపుతున్నారని ఆయన ఛైర్మన్ వివరించారు. ఆలయ నిర్మాణ పనులు, యంత్రాల కొనుగోలు, సాంకేతిక అభివృద్ధికి కూడా సహకరిస్తున్నారని తెలిపారు.

ట్రస్టులకు వారి మద్దతును పరిగణనలోకి తీసుకుని…. దాతలకు తగిన గౌరవం మరియు సరైన సౌకర్యాలు కల్పిస్తాని ఛైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు. ఈ విషయంలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఉచిత ఆహారం పంపిణీ, విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాలకు మద్దతు, వైదిక అభ్యాస పరిరక్షణ మరియు ప్రచారంతో సహా స్వచ్ఛంద విధులను నిర్వహించడానికి టీటీడీ బహుళ ట్రస్టులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

తిరుమలలోని ప్రఖ్యాత వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచవ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే ఆలయాల్లో ఒకటి. హిందూ పుణ్యక్షేత్రాలలో అగ్రస్థానంలో ఉంటుంది. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడు కోట్ల మంది యాత్రికులు వస్తుంటారని అంచనా…!

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More