TTD : ఆగస్టు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు.. తేదీలు చూడండి
TTD Update : ఆగస్టు నెలలో తిరుమలలో పలు విశేష పర్వదినాల ఉన్నాయి. ఆ వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
ఆగస్టు నెలలో తిరుమలలో పలు విశేష పర్వదినాలను తిరుమల తిరుపతి దేవస్థాన ప్రకటించింది. ఆగస్టు 14న తిరుమల శ్రీవారు పురిశైవారితోటకు వేంచేపు నిర్వహిస్తారు. ఆగస్టు 16న నాగ చతుర్థి, కశ్యప మహర్షి వర్ష తిరు నక్షత్రం ఉంది.

ఆగస్టు 17న గరుడ పంచమి, శ్రీవారి గరుడ వాహన సేవ.
ఆగస్టు 21న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతి.
ఆగస్టు 22న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ.
ఆగస్టు 25న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాల సమాప్తి.
ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమి, శ్రీవారి గరుడ వాహన సేవ, శ్రీ విఖనసమహాముని జయంతి, శ్రీ హయగ్రీవ జయంతి.
ఆగస్టు 29న తిరుమల శ్రీవారు విఖనసాచార్యుల వారి సన్నిధికి వేంచేపు.
కపిలేశ్వరస్వామివారి ఆలయ వార్షిక పవిత్రోత్సవాలు
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న వార్షిక పవిత్రోత్సవాలు ఆధ్యాత్మిక వైభవంతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం గ్రంధి పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని వేదమంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ అత్యంత శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఉదయం సుప్రభాత సేవతో శ్రీ కపిలేశ్వరస్వామివారిని మేల్కొలిపి, పవిత్ర అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ఆగమ సంప్రదాయాల ప్రకారం నిత్యహోమం, గ్రంధి పవిత్ర సమర్పణ, మూలమూర్తులకు విశేష ఉపచారాలు ఘనంగా చేపట్టారు. పవిత్రోత్సవాల ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పరమేశ్వరుని కృపాకటాక్షాలను పొందారు. సాయంత్రం యాగశాలలో ప్రత్యేక పూజలు, హోమం, లఘు పూర్ణాహుతి నిర్వహించనున్నారు.
జూలై 30న పుష్పయాగం
తిరుపతి అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 30వ తేదీన అత్యంత వైభవంగా పుష్పయాగం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల అనంతరం ఆలయ పవిత్రత, లోకక్షేమం, భక్తుల సర్వమంగళాల కోసం నిర్వహించే ఈ దివ్యోత్సవం భక్తులకు అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతిని అందించనుంది.
ఈ సందర్భంగా జూలై 29వ తేదీ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు మేధిని పూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. జూలై 30వ తేదీ ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీటితో విశేష అభిషేకం చేపడతారు.
మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి, సంపంగి, రోజా, కలువ తదితర సుగంధ పుష్పాలతో స్వామివారికి వైభవంగా పుష్పయాగం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు స్వామివారి వీధి ఉత్సవం భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తనుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


