TTD : ఆగ‌స్టు నెలలో శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయం, అనుబంధ ఆల‌యాల‌లో ఆగ‌స్టు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం వాటి వివరాలను ప్రకటించింది.

Published on: Aug 1, 2026, 17:56:50 IST
By , Tirupati
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో, ఇతర అనుబంధ ఆలయాల్లో ఆగస్టు నెలలో విశేష ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు టీటీడీ తేదీలను ప్రకటించింది. ఆ వివరాలేంటో చూడండి.

టీటీడీ
టీటీడీ

శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో

ఆగ‌ష్టు 7, 14, 28వ‌ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చిపై అమ్మ‌వారు ఆల‌య నాలుగు మాడ వీధులలో విహ‌రించి భక్తులకు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.

ఆగ‌ష్టు 25న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా శ్రీపద్మావతి అమ్మవారు సాయంత్రం 6.45 గంట‌ల‌కు గజ వాహనంపై భక్తులను కటాక్షిస్తారు.

ఆగ‌ష్ఠు 21న వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 6 గంట‌ల‌కు శ్రీపద్మావతి అమ్మవారి స్వర్ణరథోత్సవం జరుగుతుంది.

శ్రీ బలరామ కృష్ణ స్వామి వారి ఆలయంలో

ఆగ‌ష్టు 8న రోహిణి న‌క్ష‌త్రం సంద‌ర్బంగా శ్రీ కృష్ణ స్వామివారికి సాయంత్రం 6 గంట‌లకు తిరుచ్చి ఉత్సవం జ‌రుగ‌నుంది.

శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో

ఆగ‌ష్టు 3, 30వ తేదీల‌ల్లో ఉత్తర భద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంట‌లకు స్వామివారు తిరుచ్చిపై ఆల‌య నాలుగు మాడ వీధులలో విహరించి అనుగ్ర‌హించ‌నున్నారు.

శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో

ఆగ‌ష్టు 17న హస్త నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు స్వామివారు తిరుచ్చిపై భక్తులను క‌టాక్షించ‌నున్నారు.

తిరుచానూరు శ్రీనివాస ఆలయం

ఆగ‌ష్టు 1, 8, 15, 22, 29వ‌ తేదీలలో వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి మూలవర్లకు అభిషేకం.

అప్ప‌లాయ‌గుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో

ఆగ‌ష్టు 4న తేదీ ఉద‌యం 8 గంట‌ల‌కు అష్టదళ పాదపద్మారాధన సేవ.

ఆగ‌ష్టు 7, 14, 21, 28వ తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రలంకారణ సేవ, అభిషేకం.

ఆగ‌ష్టు 12న ఉదయం 8 గంటలకు అష్టోత్తరశత కలశాభిషేకం.

ఆగ‌ష్టు 26న శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి క‌ల్యాణోత్స‌వం.

ఆగ‌ష్టు 2, 9, 16, 23, 30వ‌ తేదీలలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి ఉదయం 8.15 గంట‌లకు అభిషేకం.

పుష్పయాగ మహోత్సవం

తిరుపతి నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో, నిత్యకైంకర్యాల్లో అనుకోకుండా జరిగిన లోపాల పరిహారార్థం ఆలయ ఆగమ సంప్రదాయం ప్రకారం ఈ పుష్పయాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ సుమారు ఒక టన్ను సుగంధ పుష్పాలతో స్వామివారికి పుష్పయాగం ఘనంగా సమర్పించారు. తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువ తదితర 18 రకాల పుష్పాలు, ఆరు రకాల పవిత్ర పత్రాలతో విశేష అర్చన నిర్వహించి స్వామివారిని భక్తిశ్రద్ధలతో సేవించారు.

రంగురంగుల పుష్పాలతో అలంకరించిన శ్రీ సౌమ్యనాథ స్వామివారి దివ్యసన్నిధి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు పుష్పయాగ మహోత్సవాన్ని దర్శించుకుని స్వామివారి కృపాకటాక్షాలను పొందారు. అనంతరం గోవింద నామస్మరణల నడుమ స్వామివారి వీధి ఉత్సవం ఆధ్యాత్మిక వైభవంతో సాగింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More