కర్నూలు బస్సు ఫైర్ యాక్సిడెంట్‌లో ట్విస్ట్.. అసలు ఈ ప్రమాదానికి కారణం మరో బస్సు!

ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్నూలు బస్సు ప్రమాదంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. మరో వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు.

Published on: Oct 30, 2025, 12:38:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఇటీవల బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. 19 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. అంతకుముందు బైకర్ శివశంకర్ మరణించాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే తాజాగా కర్నూలు బస్సు ప్రమాద దర్యాప్తులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు మూడో వ్యక్తి కోసం వెతుకుతున్నారు. అదే రోడ్డు మీదుగా వెళ్ళిన మరో ఓమ్ని బస్సు డ్రైవర్ గురించి సెర్చింగ్ నడుస్తోంది.

కర్నూలు బస్సు ప్రమాదం
కర్నూలు బస్సు ప్రమాదం

ఈ బస్సు బైక్‌ను రోడ్డు మధ్యలోకి లాక్కెళ్లిందని, ఆ తర్వాతే హైదరాబాద్ - బెంగళూరు వెళ్తున్న వి కావేరీ ట్రావెల్స్ బస్సు దానిని ఢీకొట్టి మరో 300 మీటర్లు ఈడ్చుకెళ్లిందని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. దీంతో మంటలు చెలరేగి 19 మంది ప్రయాణికులు మృతి చెందారు. బైక్ నడిపిన శివ శంకర్ మద్యం తాగి ఉన్నాడని, బెంగళూరు వెళ్తున్న బస్సు బైక్‌ను ఢీకొట్టడం కంటే ముందే ప్రమాదానికి గురయ్యామని ఎర్రిస్వామి చెప్పాడు.

శివశంకర్ ప్రమాదానికి గురైనప్పుడు, బైక్ డివైడర్ దగ్గర పడిపోయిందని కర్నూలు డీఐజీ ప్రవీణ్ చెప్పారు. డివైడర్‌కు ఢీకొని అక్కడికక్కడే మరణించాడని తెలిపారు. వెనుక కూర్చున్న ఎర్రి స్వామి కూడా కింద పడిపోయాడని వెల్లడించారు. సమీపంలోని పెట్రోల్ బంక్‌లోని సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తే 14 వాహనాలు ప్రమాద స్థలం గుండా వెళ్లిన్నట్లు కనిపించింది.

'డివైడర్‌కు దగ్గరగా ఉన్న బైక్‌ను ఒక బస్సు రోడ్డు మధ్యలోకి లాగి అక్కడే వదిలేసింది. కావేరీ ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొట్టి 300 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది, తర్వాత బైక్ ఇంధన ట్యాంక్ పేలిపోయింది. ప్రమాదం జరిగింది.' అని డీఐజీ ప్రవీణ్ అన్నారు.

ఇప్పటివరకు పోలీసులు ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. బస్సు డ్రైవర్ ఎం.లక్ష్మయ్య, యజమాని వేమూరి వినోద్ కుమార్. మంటల్లో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించడంలో సహాయం చేసిన రెండో డ్రైవర్ శివ నారాయణపై కేసు నమోదు చేయలేదు. లక్ష్మయ్యను బుధవారం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఆ ప్రదేశాన్ని దాటిన మరో బస్సు నుండి డ్యాష్‌బోర్డ్ ఫుటేజీని పొందిన తర్వాత మరో డ్రైవర్ ప్రమేయాన్ని పోలీసులు కనుగొన్నారని డీఐజీ తెలిపారు.

శివ శంకర్ బైక్ రోడ్డు మధ్యలో కాకుండా డివైడర్ దగ్గర పడిపోయిందని డ్యాష్‌బోర్డ్ ఫుటేజ్‌లో కనిపిస్తున్నందున, బైక్‌ను మరొక బస్సు రోడ్డు మధ్యలోకి లాగిందని గుర్తించామని డీఐజీ ప్రవీణ్ వివరించారు. బైక్‌ను రోడ్డు మధ్యలోకి ఈడ్చికెళ్లిన మరో బస్సు డ్రైవర్ రోడ్డు పక్కకు ఆపి ఉంటే ఈ ఘోర ప్రమాదం జరిగేది కాదన్నారు. ఈ డ్రైవర్ ఎవరో ఇంకా గుర్తించలేదని, డాష్‌బోర్డ్ విజువల్స్‌లో మరో బస్సు బైక్ నుండి తృటిలో తప్పించుకుందని డీఐజీ తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More