అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం - కాంగ్రెస్ మద్దతు, వైసీపీ ఏం చెప్పిందంటే..!
ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. బుధవారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.
ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును లోక్‌సభ ఆమోదం తెలిపింది. 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టం- 2014లోని సెక్షన్ 5(2)కి సవరణ చేస్తూ రూపొందించిన బిల్లును హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెట్టారు.

కాంగ్రెస్ మద్దతు..
లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు.. ఏప్రిల్ 2వ తేదీన రాజ్యసభ ముందుకు వస్తుంది. ఈ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ మాట్లాడుతూ…. ఏపీ పునర్ విభజన సందర్భంగా ఏపీకి అనేక హామీలు ఇచ్చిన విషయాన్ని లేవనెత్తారు.ఏపీకి ప్రత్యేక హోదా ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉందని గుర్తు చేశారు. ఏపీకి ఇచ్చిన హామీలను వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ప్రసంగించారు. రాజధాని అమరావతి అభివృద్దికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.
వైసీపీ ఏం చెప్పిందంటే..?
మరోవైపు అమరావతి చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ వైసీపీ వాకౌట్ చేసింది. ఇదే సమయంలో ఆ పార్టీ మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదని… ఈ తరహా బిల్లుకు మాత్రమే వ్యతిరేకమని చెప్పారు.
అమరావతిలో రైతులను భూములు సమీక రించిన సమయంలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని మిథున్ రెడ్డి వివరించారు. అమరావతిలో అవినీతి జరుగుతోందని.. కొందరు కాంట్రాక్టర్లకు అవీతినికి చిరునామా గా మారుతోందని విమర్శించారు. అసలు అమరావతి ఎప్పుడు పూర్తవుతుంది..? ఎంత ఖర్చు చేస్తారు…? అనే స్పష్టత లేదన్నారు. ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న బిల్లు స్వరూపం సరికాదని వ్యాఖ్యానించారు. ఈ బిల్లును యధాతధంగా ఆమోదించేందుకు తాము సిద్దంగా లేమని స్పష్టం చేశారు.
“అమరావతి కోసం రైతుల నుంచి 34వేల ఎకరాలు తీసుకున్నారు. భూములిచ్చిన రైతులకు అనేక హామీలిచ్చారు. రైతులకు ఇప్పటి వరకు ప్లాట్లు ఇవ్వలేదు. రైతులకు ఎప్పుడు ప్లాట్లు ఇస్తారో బిల్లులో పెట్టాలి. తనకు ప్లాట్ ఇవ్వాలంటూ రామారావు అనే రైతు గుండెపోటుతో చనిపోయారు. ఏపీ సభ్యులు ప్రత్యేక హోదా, పోలవరం గురించి మాట్లాడితే బాగుండేది” అని ఎంపీ మిథున్‌రెడ్డి ప్రసంగించారు.
ఈ బిల్లుకు లోక్ సభలో ఆమోదముద్ర లభించిన తర్వాత… రాజ్యసభ ముందుకు తీసుకువస్తారు. ఆ తర్వాత గెజిట్ విడుదలైతే… అమరావతి ఏపీ రాజధానిగా గుర్తింపు పొందనుంది. ఫలితంగా అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభిస్తుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

