డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం.. టీటీడీ కీలక నిర్ణయాలు
వైకుంఠ ఏకాదశిపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 30వ తేదీ నుంచి పది రోజులపాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనలు కల్పించనున్నట్టుగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. మరికొన్ని కీలక నిర్ణయాలను వెల్లడించారు.
టీటీడీ అత్యవసర ట్రస్ట్ బోర్డు సమావేశం మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన, ఈవో సింఘాల్, ఇతర బోర్డు సభ్యులతో కలిసి జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది బోర్డు. ఆ విషయాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. వైకుంఠ ద్వార దర్శనం డిసెంబర్ 30 నుండి జనవరి 08 వరకు భక్తులకు కల్పించనున్నట్టుగా తెలిపారు. 10 రోజుల పాటు 8 లక్షల మంది భక్తుల కోసం వైకుంఠ ద్వార దర్శనం ప్లాన్ చేశామన్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టుగా పేర్కొన్నారు.

'వైకుంఠ ద్వార దర్శనం కోసం అందుబాటులో ఉన్న 182 గంటల్లో 164 గంటలు సాధారణ భక్తులకు కేటాయించాం. ఆఫ్‌లైన్ టోకెన్ల జారీ లేదు. మొదటి మూడు రోజులు శ్రీవాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు లేవని, రద్దు చేస్తున్నాం. ఈ డిప్ ద్వారా సేకరించిన టోకెన్లు కలిగిన భక్తులకు మొదటి మూడు రోజులలో అనుమతి ఉంటుంది. జనవరి 02 నుండి 08 వరకు భక్తులు సర్వ దర్శనం ద్వారా దర్శనం చేసుకోవచ్చు.' అని టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు.
జనవరి 02 నుండి 08 వరకు ఆన్‌లైన్‌లో భక్తులకు ప్రతిరోజు 15000 రూ.300 టోకెన్లు, 1000 శ్రీవాణి టిక్కెట్లు కేటాయిస్తారు. ఆన్‌లైన్ FIFO ద్వారా జనవరి 06, 07, 08 తేదీల్లో స్థానిక దర్శన్ (ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతి)లో ఉంటుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు పది రోజులు సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా డిసెంబర్ 30, 31, జనవరి 01 తేదీలలో మొదటి మూడు రోజులలో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి దర్శనం రద్దు చేశామని బీఆర్ నాయుడు తెలిపారు.
నవంబర్ 27 నుండి డిసెంబర్ 01 వరకు దర్శన టోకెన్ల నమోదుకు భక్తులకు అవకాశం కల్పిస్తారు. డిసెంబర్ 2న ఈ-డిప్ ద్వారా ఎంపికైన వారికి దర్శన టోకెన్లు కేటాయిస్తారు. అందరికీ సమాన అవకాశాన్ని పారదర్శకంగా అందించడానికి, టోకెన్ల జారీని టీటీడీ అధికారిక వెబ్‌సైట్, టీటీడీ మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా నిర్వహిస్తారు.
తిరుపతి, తిరుమల స్థానికులకు జనవరి 6,7,8 తేదీలలో ఆన్‌లైన్‌లో ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యత ప్రాతిపదికన 5,000 టోకెన్లు అందిస్తారు.
నవంబర్ 27న అమరావతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రెండో ప్రాకారం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారని టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు.
మరోవైపు పరకామణి దొంగతనం కేసులో దోషులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా బోర్డు నిర్ణయించింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపాలని అనుకుంటోంది. ఈ సమావేశంలో టీటీడీ బోర్డు సభ్యులు, అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి, సీవీ అండ్ ఎస్ఓ మురళీ కృష్ణ, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


