రాజకీయాల్లోకి వంగవీటి రంగా కూతురు.. వైసీపీలో జాయిన్ అవుతారా?

ఏపీలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వంగవీటి రంగా కూతురు రాజకీయాల్లో వస్తానని ప్రకటించారు.

Published on: Nov 16, 2025, 17:08:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వంగవీటి కుటుంబం నుంచి మరో వ్యక్తి రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ రాజకీయాలపై స్పష్టమైన ఆసక్తిని కనబరిచారు. విజయవాడలోని రంగా విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత ఆమె తన రాబోయే రాజకీయ ప్రవేశం గురించి చెప్పారు.

రాజకీయాల్లోకి వంగవీటి రంగా కూతురు
రాజకీయాల్లోకి వంగవీటి రంగా కూతురు

తాను ఇప్పుడు అధికారిక ప్రకటన చేయడం లేదని, తర్వాత ప్రకటిస్తానని ఆశా కిరణ్ మీడియాకు చెప్పారు. రంగా ఆదర్శాలను అనుసరించాలని, ప్రజలకు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. దాదాపు దశాబ్దం పాటు ప్రజా జీవితానికి దూరంగా ఉన్న తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తున్నారు.

తన సోదరుడు వంగవీటి రాధాతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, ఆయన మద్దతు తనకు ఉందని తాను నమ్ముతున్నానని ఆశా అన్నారు. వేర్వేరు రాజకీయ నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ అది వారి సంబంధాన్ని ప్రభావితం చేయదని ఆమె అన్నారు. రాధా, రంగా మిత్ర మండలి సభ్యులకు తాను అండగా నిలుస్తానని కూడా ఆమె హామీ ఇచ్చారు.

రంగా మిత్ర మండలి సీనియర్ సభ్యులతో సంప్రదించిన తర్వాతే ఏ రాజకీయ పార్టీలో చేరాలో నిర్ణయిస్తానని ఆశా కిరణ్ అన్నారు. వారి ఆహ్వానం మేరకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పారు. రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఆశా కిరణ్. ప్రజా జీవితానికి కొంతకాలంగా తాను దూరంగా ఉన్నానన్నారు. ఇకపై తన జర్నీ పూర్తిగా ప్రజలతోనేనని చెప్పారు. రాధా, రంగా మిత్ర మండలి మధ్య కొంత గ్యాప్ వచ్చిందని, ఆ గ్యాప్ ఫుల్ ఫిల్ చేయడానికి తాను రాజకీయాల్లోకి వస్తున్నానని వివరించారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో వంగవీటి రంగాది ప్రత్యేకమైన స్థానం. ఆయన బలమైన కాపు సామాజిక వర్గ నాయకుడిగా ఎదిగి 1985లో విజయవాడ సెంట్రల్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1988లో ఆయన హత్య తీవ్ర కలకలం సృష్టించింది. ఆయన కుమారుడు రాధా తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. తరువాత వివిధ పార్టీల నుండి పోటీ చేశారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు.

చాలా సంవత్సరాలు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆశా కిరణ్ ఇప్పుడు తిరిగి వెలుగులోకి వస్తున్నారు. ఆమె ఇంకా ధృవీకరించనప్పటికీ, వైసీపీలో చేరవచ్చని రాజకీయ వర్గాలు ఇప్పటికే ఊహాగానాలు చేస్తున్నాయి. అయితే దీనిపై ఆశా కిరణ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More